హోమ్ / వంటకాలు / కోకోఖజ్జుర్ లాలీపాప్

Photo of Co co date lolipop by Swapna Sashikanth Tirumamidi at BetterButter
44
3
0.0(0)
0

కోకోఖజ్జుర్ లాలీపాప్

Jan-01-2019
Swapna Sashikanth Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోకోఖజ్జుర్ లాలీపాప్ రెసిపీ గురించి

ఇది ఒక తీపి పదార్థం. భోజనాల అనంతరం తీసుకోడానికి ,లేక సాయంత్రాలు ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు కూడా ఇది తినవచ్చు.శీతాకాలంలో ఇది ఎక్కువగా తినడంవల్ల ఆరోగ్యానికి మంచిది .రక్తవృద్ధిని కలిగించి తగిన పోషకాలను శరీరానికి అందిస్తుంది.చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మిడిల్ ఈస్టర్న్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కజ్జురం ముద్ద 200 గ్రా
  2. వేయించి పొడి కొట్టిన పప్పులు(జీడిపప్పు, బాదం,పిస్తా,అక్రూట్.. మొదలైనవి)పావుకప్పు
  3. నూపొడి( వేయించి దంచినది)పావు కప్పు
  4. ఎండుకొబ్బరి పొడి 1 కప్పు
  5. కోకో పొడి అర చెంచా
  6. దాల్చినచెక్క పొడి పావు చెంచా
  7. పళ్ళు కుట్టుకునే పుల్లలు(టూత్ పిక్స్)10...లేదా సరిపడినన్ని.
  8. అలంకరణకు చోకోలేట్ సిరప్/ఖజ్జురం సిరప్ కొద్దిగా.

సూచనలు

  1. ముందు గా పప్పులు ,నువ్వులు విడి విడిగా వేయించి పొడి చేసుకోవాలి.
  2. ఇప్పుడుఈ మిశ్రమానికి కోకో పొడి,దాల్చినచెక్క పొడి ని జల్లించి కలపాలి.
  3. ఖజ్జురం గింజలు తీసి మిక్సీలో వేసి నీరు పోయకుండా ముద్దలా చేసుకోవాలి.
  4. ఇప్పుడు,ఈ పొడుల మిశ్రమాన్ని ఖజ్జురం ముద్దలోవేసి బాగా కలపాలి
  5. ఇప్పుడు దాన్ని నిమ్మకాయలంతటి ఉండలుగా చేసి కొబ్బరిపొడిలో బాగా అద్ది ఒక్కొవుండకి ఒక్కో పుల్లని గుచ్చి చోకోలేట్ సిరప్ తోగాని, డేట్ సిరప్ తోగాని అలంకరించాలి.
  6. ఇలా చేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి నిలువ చేసుకోవాలి...
  7. అంతే చక్కటి కోకో ఖజ్జుర్ లాలీపాప్ లు సిద్ధం.ఆటలాడి అలసి వచ్చినపిల్లలకు ఒక లొలిపాప్ ఇచ్చి గ్లాసుడుపాలు ఇస్తే చాలు తక్షణ శక్తి పుంజుకుంటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర