వెజ్ మంచురియా | Veg manchuria Recipe in Telugu

ద్వారా Ram Ram  |  2nd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Veg manchuria by Ram Ram at BetterButter
వెజ్ మంచురియాby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

11

0

వెజ్ మంచురియా వంటకం

వెజ్ మంచురియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg manchuria Recipe in Telugu )

  • క్యాబేజి తురుము 1/2కప్పు
  • క్యారెట్ తురుము 1/4కప్పు
  • కారం 2స్పూన్లు
  • ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  • వెల్లులి ముక్కలు 2స్పూన్లు
  • అల్లం ముక్కలు 1స్పూన్
  • కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
  • మైదా 4 స్పూన్స్
  • వెనిగర్ 1స్పూన్
  • సొయా సాస్ 1 స్పూన్
  • చిల్లి సాస్ 1స్పూన్
  • మిరియాల పొడి 1స్పూన్
  • ఆయిల్ డీప్ ఫ్రై కి
  • నీళ్లు సరిపడా
  • ఉప్పు సరిపడా
  • కొత్తిమీర కొద్దిగా

వెజ్ మంచురియా | How to make Veg manchuria Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో క్యాబేజీ తురుము,క్యారెట్ తురుము కారం, ఉప్పు,మైదా,కార్న్ ఫ్లోర్ వేసి అంతా బాగా కలుపుకోవాలి
  2. నీళ్లు అవసరపడకుండా క్యాబేజీ లో తడి సరిపోతుంది లేదా చాలా కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు
  3. ఇప్పుడు వాటిని చిన్న బాల్స్ ల చేసుకుని పెట్టుకోవాలి
  4. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడి అయ్యాక మంచురియన్ బాల్స్ ని ఫ్రై చేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ మరియు 1/2కప్పు నీళ్లు వేసి బాగా కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి అల్లం వెల్లులి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
  7. ఇప్పుడు కొద్దిగా ఉప్పు,వెనిగర్, సొయా సాస్,మిరియాల పొడి, కారం వేసి అంతా బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కార్న్ స్టార్చ్ మిశ్రమం వేసి బబుల్స్ రానివ్వాలి
  9. ఇప్పుడు మనం వేయించిన మంచురియా బాల్స్ వేసి అన్ని కలిపి గ్రేవీ పట్టి బాగా దగ్గర పడేవరకు వేయించుకోవాలి
  10. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

Reviews for Veg manchuria Recipe in Telugu (0)