హోమ్ / వంటకాలు / వెజ్ మంచురియా

Photo of Veg manchuria by Ram Ram at BetterButter
1
3
0(0)
2

వెజ్ మంచురియా

Jan-02-2019
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ మంచురియా రెసిపీ గురించి

మంచురియా చాలా రుచిగా ఉంటుంది సాధారణంగా బయట కలర్ వేసి చేస్తారు మనం ఇంట్లో చేసుకుంటే కలర్ అవసరం లేకుండా చేసుకుంటాం పిల్లలు వీటిని చేసుల ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

 • చంటి పిల్లలకి తినిపించ తగినవి
 • గుడ్డు-లేని
 • తేలికైనవి
 • చైనీస్
 • వేయించేవి
 • చిరు తిండి
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

 1. క్యాబేజి తురుము 1/2కప్పు
 2. క్యారెట్ తురుము 1/4కప్పు
 3. కారం 2స్పూన్లు
 4. ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
 5. వెల్లులి ముక్కలు 2స్పూన్లు
 6. అల్లం ముక్కలు 1స్పూన్
 7. కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
 8. మైదా 4 స్పూన్స్
 9. వెనిగర్ 1స్పూన్
 10. సొయా సాస్ 1 స్పూన్
 11. చిల్లి సాస్ 1స్పూన్
 12. మిరియాల పొడి 1స్పూన్
 13. ఆయిల్ డీప్ ఫ్రై కి
 14. నీళ్లు సరిపడా
 15. ఉప్పు సరిపడా
 16. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

 1. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో క్యాబేజీ తురుము,క్యారెట్ తురుము కారం, ఉప్పు,మైదా,కార్న్ ఫ్లోర్ వేసి అంతా బాగా కలుపుకోవాలి
 2. నీళ్లు అవసరపడకుండా క్యాబేజీ లో తడి సరిపోతుంది లేదా చాలా కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు
 3. ఇప్పుడు వాటిని చిన్న బాల్స్ ల చేసుకుని పెట్టుకోవాలి
 4. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడి అయ్యాక మంచురియన్ బాల్స్ ని ఫ్రై చేసుకోవాలి
 5. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ మరియు 1/2కప్పు నీళ్లు వేసి బాగా కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి
 6. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి అల్లం వెల్లులి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
 7. ఇప్పుడు కొద్దిగా ఉప్పు,వెనిగర్, సొయా సాస్,మిరియాల పొడి, కారం వేసి అంతా బాగా కలుపుకోవాలి
 8. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కార్న్ స్టార్చ్ మిశ్రమం వేసి బబుల్స్ రానివ్వాలి
 9. ఇప్పుడు మనం వేయించిన మంచురియా బాల్స్ వేసి అన్ని కలిపి గ్రేవీ పట్టి బాగా దగ్గర పడేవరకు వేయించుకోవాలి
 10. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర