హోమ్ / వంటకాలు / నల్ల సేనగలు బిర్యానీ

Photo of Black chana biryani by Pasumarthi Poojitha at BetterButter
699
6
0.0(0)
0

నల్ల సేనగలు బిర్యానీ

Jan-02-2019
Pasumarthi Poojitha
720 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నల్ల సేనగలు బిర్యానీ రెసిపీ గురించి

పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన వంట సేనగలు పిల్లల బ్రెయిన్ ని చాలా తెలివిగా ఉంచుతాయి అంట...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. శనగలు 1 గిన్నె
  2. బిర్యానీ దినుసులు 1 ప్యాకెట్
  3. ఉల్లిపాయ 1
  4. అల్లం వెల్లులి పేస్ట్ 1 స్పూన్
  5. నూనె కొద్దిగా
  6. ఉప్పు సరిపడా
  7. బిర్యానీ మసాలా పొడి 1 స్పూన్
  8. నీళ్లు సరిపడా
  9. బియ్యం 1 గిన్నె
  10. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా శనగలు 12 గంటలు నానపెట్టి 4,5 విస్సెల్స్ వచ్చే వరకు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఉల్లిపాయ సన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.బియ్యం కడిగి నీళ్లు పోసి 15 నిమిషాలు నానపెట్టాలి.
  3. ఇప్పుడు పొయ్యే వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో బిర్యానీ దినుసులు వేసి కొంచం వేగనివ్వాలి.
  4. ఇప్పుడు అదే గిన్నె లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లులి పేస్ట్ వేసుకోవాలి ,కొత్తిమీర వేసుకొని ఉడికించిన శనగలు ఉడికించిన నీళ్లు 1 కప్ పోసుకోవాలి నీళ్లు 1 కప్ పోసుకొని ఉప్పు సరిపడా శనగలు వేసుకొని కాసేపు మరిగే వరకు ఉండాలి.
  5. ఇప్పుడు ననపెట్టిన బియ్యం నీళ్లు వర్చుకొని అందులో వేసుకోవాలి,బిర్యానీ మసాలా వేసుకొని మూత పెట్టి మూడు వేసిల్స్ వచ్చే వరకు ఉంచుకొని పొయ్యే కటేయాలి.
  6. అంతే వేడి వేడి శనగలు బిర్యానీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర