ఆలు బన్స్ | POTATO BUNS Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  2nd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of POTATO BUNS by Rashmi SudhiMurthy at BetterButter
ఆలు బన్స్by Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    3

    గంటలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4

0

ఆలు బన్స్ వంటకం

ఆలు బన్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make POTATO BUNS Recipe in Telugu )

  • మైదా లేక గోధుమ పిండి 1 కప్
  • డ్రై ఈస్ట్ 3/4 టీ స్పూన్
  • పాలు 1/3కప్ మరియు 3 టేబుల్ స్పూన్లు (బ్రష్ చేయడానికి బన్స్ పైన)
  • పంచదార 1 టీ స్పూన్
  • ఉప్పు రుచికి సరి పడ
  • ఆలీవ్ నూనె 2 టేబుల్ స్పూన్లు
  • స్టఫింగ్ కోసం- ఉడికించిన ఆలు 4
  • ఉల్లిపాయ ముక్కలు 1కప్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  • ఉప్పు రుచికి సరిపడా
  • గరం మసాలా 1 టీ స్పూన్
  • కొత్తిమీర తరుగు 1/4 కప్
  • పచ్చిమిర్చి 2
  • కరివేపాకు సన్నగా తరిగినవి 1 టీ స్పూన్
  • నూనె 2 టేబుల్ స్పూన్లు

ఆలు బన్స్ | How to make POTATO BUNS Recipe in Telugu

  1. ముందుగా పాలు వెచ్చగ చేసి అందులో పంచదార, ఈస్ట్ వేసి కలిపి 10 నిమిషాలు ఉంచాలి
  2. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లో మైదా లేదా గోధుమ పిండి,ఉప్పు, వేసి కలిపి మధ్యలో ఈస్ట్ కలిపిన పాలు వేసి,నూనె వేసి ముద్దలా కలిపి 2 గంటలు ఉంచాలి
  3. ఈ లోపల స్టఫింగ్ కోసం కూర చేసుకోవాలి
  4. ఒక పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు,గరంమసాలా వేసి వేపాలి
  5. ఇప్పుడు ఇందులో ఉడికించి మెదిపిన ఆలుని,కొత్తిమీర తరుగుని వేయాలి
  6. 3 గంటల తరువాత మైదా లేదా గోధుమ పిండితో చేసిన ముద్దను సమానంగా భాగాలు చేసుకోవాలి
  7. ఇప్పుడు ఇందులో బొబ్బట్లుకి స్టఫ్ చేసినట్లు ఆలు కూరని స్టఫ్ చేసి బన్స్ని బేకింగ్ పేపర్ మీద పెట్టుకోవాలి
  8. ఇప్పుడు పాలతో బన్స్ పైన బ్రష్ చేయాలి
  9. మైక్రోవేవ్ ఒవేన్ 200 డిగ్రీలు సెలసీయస్ ప్రి హీట్ చేసి పెట్టుకోవాలి.
  10. 200డిగ్రీ లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి.మధ్యలో ఒక సారి పాలతో బ్రష్ చేసుకుంటే బన్స్ సాఫ్ట్ గా బాగా వస్తాయి
  11. రుచికరమైన ఆలు బన్స్ వేడి వేడి గా రెడీ

నా చిట్కా:

పిండి కలిపేటప్పుడు చేతికి మరి అంటుకుంటే నూనె రసుకోవచ్చు.ఈస్ట్ పొంగకపోతే బన్స్ సరిగా రాదు

Reviews for POTATO BUNS Recipe in Telugu (0)