BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆలు బన్స్

Photo of POTATO BUNS by Rashmi SudhiMurthy at BetterButter
1
4
0(0)
0

ఆలు బన్స్

Jan-02-2019
Rashmi SudhiMurthy
180 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు బన్స్ రెసిపీ గురించి

ఇది సాయంత్రం స్నాక్స్ లాగా లేక పిల్లల పార్టీకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా లేక గోధుమ పిండి 1 కప్
  2. డ్రై ఈస్ట్ 3/4 టీ స్పూన్
  3. పాలు 1/3కప్ మరియు 3 టేబుల్ స్పూన్లు (బ్రష్ చేయడానికి బన్స్ పైన)
  4. పంచదార 1 టీ స్పూన్
  5. ఉప్పు రుచికి సరి పడ
  6. ఆలీవ్ నూనె 2 టేబుల్ స్పూన్లు
  7. స్టఫింగ్ కోసం- ఉడికించిన ఆలు 4
  8. ఉల్లిపాయ ముక్కలు 1కప్
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  10. ఉప్పు రుచికి సరిపడా
  11. గరం మసాలా 1 టీ స్పూన్
  12. కొత్తిమీర తరుగు 1/4 కప్
  13. పచ్చిమిర్చి 2
  14. కరివేపాకు సన్నగా తరిగినవి 1 టీ స్పూన్
  15. నూనె 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా పాలు వెచ్చగ చేసి అందులో పంచదార, ఈస్ట్ వేసి కలిపి 10 నిమిషాలు ఉంచాలి
  2. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లో మైదా లేదా గోధుమ పిండి,ఉప్పు, వేసి కలిపి మధ్యలో ఈస్ట్ కలిపిన పాలు వేసి,నూనె వేసి ముద్దలా కలిపి 2 గంటలు ఉంచాలి
  3. ఈ లోపల స్టఫింగ్ కోసం కూర చేసుకోవాలి
  4. ఒక పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు,గరంమసాలా వేసి వేపాలి
  5. ఇప్పుడు ఇందులో ఉడికించి మెదిపిన ఆలుని,కొత్తిమీర తరుగుని వేయాలి
  6. 3 గంటల తరువాత మైదా లేదా గోధుమ పిండితో చేసిన ముద్దను సమానంగా భాగాలు చేసుకోవాలి
  7. ఇప్పుడు ఇందులో బొబ్బట్లుకి స్టఫ్ చేసినట్లు ఆలు కూరని స్టఫ్ చేసి బన్స్ని బేకింగ్ పేపర్ మీద పెట్టుకోవాలి
  8. ఇప్పుడు పాలతో బన్స్ పైన బ్రష్ చేయాలి
  9. మైక్రోవేవ్ ఒవేన్ 200 డిగ్రీలు సెలసీయస్ ప్రి హీట్ చేసి పెట్టుకోవాలి.
  10. 200డిగ్రీ లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి.మధ్యలో ఒక సారి పాలతో బ్రష్ చేసుకుంటే బన్స్ సాఫ్ట్ గా బాగా వస్తాయి
  11. రుచికరమైన ఆలు బన్స్ వేడి వేడి గా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర