హోమ్ / వంటకాలు / హనీ కేక్(గోధుమపిండి,బెల్లంతో ప్రెషర్ కుక్కర్ లో)

Photo of Honey cake by sneha gilla at BetterButter
739
4
0.0(0)
0

హనీ కేక్(గోధుమపిండి,బెల్లంతో ప్రెషర్ కుక్కర్ లో)

Jan-02-2019
sneha gilla
30 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హనీ కేక్(గోధుమపిండి,బెల్లంతో ప్రెషర్ కుక్కర్ లో) రెసిపీ గురించి

కేక్ ని సాధారణంగా మైదా,షుగర్ తో చేస్తారు.కానీ ఇలా గోధుమపిండి,బెల్లంతో చేయటం వల్ల ఆరోగ్యానికి కూడా చాల మంచిది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • బేకింగ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమపిండి 1 కప్
  2. బెల్లం 1 కప్
  3. పెరుగు 1/2 కప్
  4. ఆయిల్ 1/2 కప్
  5. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
  6. బేకింగ్ సోడా 1/2 స్పూన్
  7. వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్
  8. డ్రై ఫ్రూప్ట్స్ 1/4 కప్
  9. తేనె 2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా మైదా,బేకింగ్ పౌడర్,బేకింగ్ సోడా ని జల్లెడతో జల్లించి పెట్టుకోవాలి.
  2. మిక్సీ జార్లో బెల్లం,నూనె,పెరుగు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  3. అందులోనే జల్లించుకున్న మైదా,వెనిలా ఎసెన్స్ కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఒక బేకింగ్ ట్రే తీసుకొని చుట్టూ నెయ్యి రాసి దాని పైన మైదా జల్లుకోవాలి.
  5. ఇప్పుడు ఆ బేకింగ్ ట్రే లో ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని వేసి పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి.
  6. ఇప్పుడు కుక్కర్ లో సుమారుగా 1 కప్ ఇసుక లేదా ఉప్పు వేసి అందులో చిన్న గిన్నె లేదా ప్లేట్ బోర్లించి విజిల్,గ్యాసెట్ తీసేసి 10 నుంచి 15 నిముషాలు వేడి చేయాలి.
  7. తర్వాత మూత తీసి బేకింగ్ ట్రే పెట్టి విసిల్,గ్యాసెట్ లేకుండానే మూతపెట్టి 40 నుంచి 45 నిముషాలు చిన్న మంటపై బేక్ చేసుకోవాలి.
  8. 30 నిముషాల తర్వాత మధ్య మధ్యలో టూత్పిక్ లేదా నైఫ్ తో గుచ్చి చెక్ చేసుకోవాలి.టూత్ పిక్ కి అంటుకుంటే కాసేపు ఉంచాలి.
  9. అంటుకొనట్లైతే స్టవ్ అఫ్ చేసి పూర్తిగా చల్లారాక చివర్లు నెమ్మదిగా కదిలించి కేక్ ని ఒక ప్లేట్ లోకి రెవర్స్ చేసి నెమ్మదిగా తీయాలి.
  10. చివరిగా తేనే లో కొన్ని నీళ్లు కలుపుకోవాలి.
  11. కేక్ పై ఫోర్క్ తో గాట్లు పెటుకొని దానిపైన తేనే మిశ్రమాన్ని వేసి 5 నిముషాలు ఉంచి కట్ చేసి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర