హోమ్ / వంటకాలు / గోధుమపిండి బ్లూ బెర్రీ మఫిన్స్ (గుడ్డు లేకుండా)

Photo of Eggless wheatflour blueberry muffins by Lalitha Kandala at BetterButter
543
5
0.0(0)
0

గోధుమపిండి బ్లూ బెర్రీ మఫిన్స్ (గుడ్డు లేకుండా)

Jan-02-2019
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి బ్లూ బెర్రీ మఫిన్స్ (గుడ్డు లేకుండా) రెసిపీ గురించి

కేక్ , మఫిన్స్ అంటే పిల్లలకు బాగా ఇష్టం. కానీ వాటిని బయట మైదా తో చేస్తారు. ఆరోగ్యానికి ఉపయోగం లేని మైదా కంటే గోధుమపిండి తో చేసుకోవచ్చు. శాఖాహారులు గుడ్డు లేకుండా కూడా చేసుకోవచ్చు. బ్లూబెరి పండ్లులో ఆంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. పిల్లలకు వాటిని కప్ కేకుల్లో వేసి పెడితే నచ్చుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. 1 1/2 కప్ గోధుమపిండి
  2. 3/4 కప్ పంచదార
  3. 3/4 కప్ బ్లూబెరి
  4. 1 కప్ పాలు
  5. 1 టీ స్పూన్ బేకింగ్ పొడి
  6. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా
  7. 1 టేబుల్ స్పూన్ వెనీలా
  8. 1/4 టీ స్పూన్ ఉప్పు
  9. 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
  10. 1/2 కప్ నూనె

సూచనలు

  1. ముందుగా ఒవేన్ ను 15 నిమిషాలు 180 డిగ్రీస్ వద్ద ప్రీ హీట్ చెయ్యాలి
  2. మఫిన్స్ మౌల్డ్స్ లో మఫిన్స్ లైనర్లు వేసి ఉంచాలి
  3. గోధుమపిండి, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, ఉప్పు కలిపి జల్లించుకోవాలి
  4. ఒక గిన్నెలో పంచదార, పాలు, నిమ్మరసం, నూనె, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసి బాగా కలపాలి.
  5. బ్లూ బెర్రీస్ బాగా కడిగి ఆరాక కొంచెం గోధుమపిండి పిండి వేసి కలపాలి.
  6. పంచదార మిశ్రమం లో గోధుమపిండి వేసి, బ్లూ బెర్రీస్ కూడా వేసి కలుపుకొని ముఫిన్ ట్రే లో మూడు వంతులు వరకు అన్ని మఫిన్స్ మౌల్డ్ లలో వేసి ఒక 15 నిమిషాలు బేక్ చెయ్యాలి
  7. ఒక పుల్ల గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉంటే మఫిన్స్ రెడీ అయ్యినట్లే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర