మొక్కజొన్న కొత్తిమీర కాల్జోన్ | Corn Coriander Calzone Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  3rd Jan 2019  |  
5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Corn Coriander Calzone by Anitha Rani at BetterButter
మొక్కజొన్న కొత్తిమీర కాల్జోన్by Anitha Rani
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

25

2

మొక్కజొన్న కొత్తిమీర కాల్జోన్ వంటకం

మొక్కజొన్న కొత్తిమీర కాల్జోన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Corn Coriander Calzone Recipe in Telugu )

 • పిండి తయారీకి :
 • గోధుమ పిండి 200గ్రా
 • ఉప్పు సరిపడా
 • నూనె /చీజ్ 2 చెంచాలు
 • స్టఫింగ్ / లోపల నింపడానికి :
 • కొత్తిమీర 1కట్ట
 • ఉల్లిపాయ ముక్కలు 1కప్
 • పచ్చిమిర్చి 4
 • ఉప్పు 1/2 టేబుల్ స్పూన్
 • స్వీట్ కార్న్ 1కప్ 100గ్రా
 • వేయించడానికి :
 • నూనె సరిపడా

మొక్కజొన్న కొత్తిమీర కాల్జోన్ | How to make Corn Coriander Calzone Recipe in Telugu

 1. పిండి తయారీ : ఒక బేసిన్ తీసుకొని అందులో గోధుమపిండి,ఉప్పు,కొద్దిగా నూనె వేసి కలపాలి.తరువాత సరిపడా నీరు వేసి రోటి పిండి లాగా కలుపుకోవాలి.
 2. లోపల నింపడానికి : కొత్తిమీర ను కడిగి చిన్న గా కత్తిరించు కోవాలి.
 3. మిక్సీ జార్ లో కొత్తిమీర,ఉల్లిపాయ,ఉప్పు వేసి పలుకుగా ఆడించాలి.
 4. అందులోనే ఉడికించిన మొక్కజొన్న గింజలు ఒకసారి తిప్పాలి.
 5. ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టు కోవాలి.
 6. పిండిని చేతితో బాగా మర్దన చేసి 8 నిమ్మకాయ పరిమానములో ఉండలు చేసి పెట్టు కోవాలి.
 7. అన్ని రోటీ ల లాగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి.
 8. ఒకటి తీసుకొని దానిపైన కొత్తిమీర,మొక్కజొన్న ముద్దను పలుచగా రుద్దుకోవాలి.
 9. దానిపైన మరొక టి పెట్టి మూత లాగా అన్ని వైపులా మూయాలి.
 10. చివరాల ఒత్తుకొని ఫోర్క్ తో క్రింది విధముగా చివరాల ఒత్తుకోవాలి.
 11. మధ్యలో కూడా ఫోర్క్ తో అక్కడక్కడ చెక్కు కోవాలి.
 12. ఇప్పుడు కాల్జోన్ లను కాల్చుకోవాలి.
 13. స్టవ్ పైన రోటి పెనము పెట్టి కొద్దిగా చీజ్ ను వేసి పైన ఒత్తుకున్న కలజోన్ల్ ను వేసి వేపుకోవాలి.
 14. రెండు వైపులా చీజ్/నూనె మన ఇష్టము తో వేపుకోవాలి.
 15. ఈ విధముగా అన్ని తయారు చేసుకుని పెనము పై వేపు కోవాలి.
 16. రుచి కరమైన మొక్కజొన్న కొత్తిమీర కలజోన్ల్ తయారు.
 17. పిల్లలకు లంచ్ బాక్స్ లకు,సాయంత్రము టీ తో పాటు ,టొమోటో కచప్ తో తినొచ్చు.

నా చిట్కా:

లోపల నింపడానికి చేసుకున్న మిశ్రమము పలుచగా ఉండకూడదు.

Reviews for Corn Coriander Calzone Recipe in Telugu (2)

Swathi Ram6 months ago

Super testy
జవాబు వ్రాయండి

Gadige Maheswaria year ago

Yummy ga unai Andi :yum:
జవాబు వ్రాయండి