జీళ్ళు | JEEDI( sweet hard cakes with jaggery) Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  3rd Jan 2019  |  
5 నుండి 4సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of JEEDI( sweet hard cakes with jaggery) by Swapna Sashikanth Tirumamidi at BetterButter
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

22

4

జీళ్ళు వంటకం

జీళ్ళు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make JEEDI( sweet hard cakes with jaggery) Recipe in Telugu )

 • బెల్లం అర కిలో
 • నీళ్లు ఒక గ్లాసు
 • మైదాపిండి ఒక కప్పు
 • తెల్లనువ్వులు అరకప్పు
 • నూని కొద్దిగా
 • పెద్ద వెడల్పు గల పళ్లాలు/బేసనులు 2(ఒకటి కాస్త చిన్నది,ఒకటి కాస్త పెద్దది ఉండాలి)
 • జీళ్ళు చెయ్యడానికి వీలుగా ఒక పెద్ద పీట గానీ,ఏదైనా శుభ్రమైన నున్నని ఉపరితలం ఉన్న ప్రదేశం గానీ సిద్ధం చేసి ఉంచుకోవాలి.

జీళ్ళు | How to make JEEDI( sweet hard cakes with jaggery) Recipe in Telugu

 1. ముందుగా బెల్లము తియ్యగా ఉన్నది , శుభ్రం గా ఉన్నది ఎంచి తీసుకోవాలి.మూకుడులో గ్లాసు నీళ్లు పోసి ఈ బెల్లం ముక్కలుగా కొట్టి వేసి మంట మధ్యస్టం గా పెట్టి కరిగించాలి.
 2. అది కరిగేలోపు నువ్వులు కమ్మగా ఎర్రగా వేయించి పెట్టుకోవాలి
 3. ఇప్పుడు ఉన్న రెండిటిలో ఒక పెద్ద బెసను తీసుకుని అందులో సగానికి ఎక్కువగా నీళ్లు పోసి ఉంచాలి.
 4. ఇప్పుడు కొద్దిగాచిన్న బెసను కి లోపల అర చెంచా నూని రాసి నీళ్లు పోసిన బెసను లో పెట్టాలి.ఎక్కడాకూడా నూని ఎక్కువ రాయకూడదు.జీళ్ళు నూని వాసన వస్తాయి.
 5. ఈ పాటికి బెల్లం బాగా కరిగి ఉంటుంది.చిన్న గిన్నీలో నీళ్లు పోసి పెట్టుకోవాలి పాకం చూసుకోడానికి .
 6. బెల్లంపాకం బాగా నురుగ వచ్చిన తరువాత కొద్దిసేపటికి 3 పాకంచుక్కలు చిన్నగిన్ని నీటిలో వేసి వుండకట్టినదో లేదో చూడాలి.
 7. నీటిలో వేసిన పాకం వేలితో దగ్గర చేస్తే వెంటనే దగ్గర పడి వుండకట్టాలి.ఆ ఉండ వెంటనే జారి పోకుండా అలా వేలి మీద నిలబడాలి.
 8. ఇప్పుడు మొత్తంపాకాన్ని జాగర్తగా నూని రాసిన బెసను లో పోయాలి.
 9. ఒక 5,6 నిమిషాలు కాస్త వేడి కొద్దిగా తగ్గే వరకు అలావుంచాలి
 10. తరువాత ఒక చెంచా తో బెసను అంచులకున్న పాకాన్ని లేపి మధ్యలోకి వేస్తూ ఉండాలి.ఇలా మొత్తం పాకం దగ్గరికి చూసేవరకూ నీటిలోనే ఉండాలి. ఇలా పాకం అంచులు మధ్యలోకి వేస్తూ ఉండటంవల్ల మధ్యలో పాకం పక్కకు జారి అదికూడా చల్లపడుతూ ఉంటుంది.
 11. ఇంకో 5,6 నిమిషాలకు పాకం మొత్తంబాగా దగ్గర పడి పెద్ద ముద్దలా అవుతుంది,చెయ్యి పట్టగలిగే అంత స్థాయికి వస్తుంది
 12. ఇప్పటి నుండి పని కాస్త కష్టమే.ఈ ముద్ద పాకం చేతికి అతుక్కుపోతూ ఉంటుంది కాబట్టి నూనె చుక్క చేతికి రాసుకుని ఈ ముద్దని సాగతీస్తూ ఉండాలి. నూనె ఎక్కువ రాసుకోవద్దు.
 13. ఇలా సాగదీసి మధ్యలోకి మడిచి మళ్ళీ సాగదీస్తూ ఉండాలి
 14. ఇలా సాగదీస్తూ,మడుస్తూ,సాగదీస్తూ ఉండాలి ఎప్పటిదాకా అంటే మొత్తం పాకం బెల్లం రంగు పోయి బంగారు రంగు రావాలి
 15. ఇలా పాకంలో ఎక్కడా బెల్లం రంగు కనపడకూడదు. ఇలా సాగదీస్తున్నంతసేపు ఎక్కడ ఆపకూడదు,కిందపెట్టకూడదు.పెడితే మళ్ళీ అక్కడ అతుక్కుపోతుంది.ఈ విధంగా సాగతియ్యడం అనేది కనీసం 70 నుండి 80 సార్లు ఖచితం గా చెయ్యాలి.
 16. మొత్తం తెల్ల బంగారు కడ్డీలా కనపడాలి.ఇలా తయారైన పాకాన్ని రెండు భాగాలుగా చేసి ఇప్పుడు మైదా పిండిని పీటమీద చల్లి దానిమీద పెట్టుకోవాలి
 17. ఇప్పుడు ఒకభాగాన్ని పీట మీద మైదా పిండి రాసి ఒక పక్కగా పెట్టి,ఒక భాగాన్ని మైదా పిండి చల్లి పీట మీద దొర్లిస్తూ,నూపప్పు వేసి పొడవుగా,గుండ్రంగా కడ్డీలా చేసుకోవాలి
 18. ఇప్పుడు వేయించిన నూపప్పు పక్కన పెట్టుకొని నూపప్పు అద్దుకుంటూ కత్తితో అంగుళం పరిమాణంలో ముక్కలుగా చేసుకొని అన్నిపక్కల నూపప్పు అద్దుకోవాలి
 19. ఇలా రెండో భాగాన్ని కూడా పైన చెప్పిన విధంగా చేసుకోవాలి.కొరకడానికి వీలుగా ఉంటుంది అని నేను కాస్త బిళ్ళలాగా చేసాను.ఆకృతి ఏదైనా రుచిలో తేడా రాలేదు.
 20. అన్నీ సిద్ధం అయ్యాక మైదాపిండి అన్ని పక్కలా చల్లి ఒక పళ్ళెం లోనో డబ్బాలోనో విడి విడిగా పెట్టి ఫ్రిడ్జిలో పెట్టుకుంటే త్వరగా గట్టి పడి తినడానికి కర కర లాడుతూ కాస్సేపటికి సాగుతూ చాలా బావుంటాయి
 21. అంతే అండి జీళ్ళు సిద్ధం అయినట్టే .ఒక్క జీడిని సుమారు పావుగంట సేపు తింటూ ఆస్వాదించవచ్చు.నిజం నమ్మండి. మా అమ్మాయి ఆస్వాదిస్తుంటే నేను మురిసిపోయా. నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.పంటి కింద నూపప్పు పడుతుంటే కమ్మగా చక్కటి రుచి. జీడీ మొదట కరకర లాడుతూ మెల్లగా సాగుతూ అబ్బా ఎంత అద్భుతంగా వుందో.మరింత ఆరోగ్యం కూడా.ఎందుకంటే బెల్లం కాబట్టి.పైగా ఇంట్లో చేసినవి కదా దుమ్ము,ధూళి,ఈగలు బాధ లేదు.మీరుకూడా ప్రయత్నిమ్చండి.నా జీళ్ళు ఎలవున్నాయో తప్పక నాకు తెలిచేయండి.

నా చిట్కా:

రెండో మనిషి సాయం లేకుండా చేయవద్దు.చంటిపిల్లలను దగ్గర పెట్టుకుని చేయవద్దు.బెల్లం పాకం మీద పడితే తోలు ఊడి పోతుంది.

Reviews for JEEDI( sweet hard cakes with jaggery) Recipe in Telugu (4)

Pravallika Srinivasa year ago

అధరాహో నేను కుదిరినప్పుడు తప్పక ట్ర్య్ చేస్తాను
జవాబు వ్రాయండి

Aparna Reddya year ago

Nice
జవాబు వ్రాయండి

Gadige Maheswaria year ago

చాలా బాగుంది అండి:ok_hand:
జవాబు వ్రాయండి

Shobha.. Vrudhullaa year ago

Chala bagundandi
జవాబు వ్రాయండి
Swapna Sashikanth Tirumamidi
a year ago
ధన్యవాదాలు అండి:pray:

Cooked it ? Share your Photo