హోమ్ / వంటకాలు / మల్టిపుల్ లేయర్ పిజ్జా

Photo of Multiple layar pizza by Kavitha Perumareddy at BetterButter
339
6
0.0(0)
0

మల్టిపుల్ లేయర్ పిజ్జా

Jan-04-2019
Kavitha Perumareddy
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మల్టిపుల్ లేయర్ పిజ్జా రెసిపీ గురించి

ఈ పిజ్జాలో గోధుమ పిండి,వెన్న,క్యాప్సికం ,చీజ్ అన్ని ఆరోగ్యానికి మంచిది .ఇలా లేయర్స్ గా చేస్తే కొత్తగా పిల్లలకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది అని చేసాను ..చాలా బాగుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మైక్రోవేవులో చెయ్యటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి పావుకిలో
  2. చెక్కర 3 టేబుల్ స్పూన్స్
  3. ఉప్పు చిన్న స్పున్ తో పావు స్పున్
  4. వెన్న 3 టేబుల్ స్పూన్స్
  5. బేకింగ్ ఫావడర్
  6. క్యాప్సికం 3 రెడ్,ఎల్లో,గ్రీన్ వి
  7. ఉల్లిపాయలు 3
  8. పిజ్జా సాస్ ఒక కప్
  9. చిల్లీప్లెక్స్ 2 స్పూన్స్
  10. స్పైసీ మసాలా పొడి 2 స్పూన్స్
  11. చీజ్ చిప్స్ ఒక కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్పు,బేకింగ్ ఫావడర్, చెక్కర,వెన్న వేసుకొని బాగా కలిపి తరువాత తగినన్నీ నీళ్లుపోసి చెపాతి పిండిలా కలిపి తడి గుడ్డ కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి.
  2. కూరగాయలు అన్ని ముక్కలు తరిగి పెట్టుకోవాలి .
  3. తరువాత నానిన పిండిని బాగా మర్దనా చేసి నిమ్మకాయ సైజ్ ముద్దలు చేసుకోవాలి .ఒక 8 చేసుకోవాలి.వాటిని పూరిల్లా సమానంగా ఒత్తుకోవాలి.
  4. వీటిని పెనం మీద వేసి సగం కాలేవరకు కాల్చుకోవాలి .మరీ చెపాతి ల కాల్చద్దు .నూనె కూడా వేయద్దు ఉట్టిగా ప్రీ హీట్ చేసుకోవాలి.
  5. ఇప్పుడు ముందుగా ఒక లేయర్ వేసుకొని పిజ్జా సాస్ రాసి కూరగాయలు ముక్కలు పరుచుకోవాలి.మసాలా పొడి చల్లాలి.
  6. మళ్ళీ దానిపై ఇంకో లేయర్ వేసి సాస్ రాసి చీజ్ చిప్స్ పరవాలి .ఇలా...
  7. మళ్ళీ ఒక లేయర్ కూరగాయలు, ఒక లేయర్ చీజ్ పరుచుకుంటు అన్ని లేయర్స్ వేసుకోవాలి .పైన లేయర్ పైన సాస్ రాసి కూరగాయలు ముక్కలు పరిచి చీజ్ కూడా పరవాలి.పైన మసాలా పొడి ,చిల్లీ ప్లేక్స్ చల్లాలి.
  8. తరువాత 5 నిముషాలు ముందుగా వేడి చేసుకున్న ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 30 నిముషాలు ఉంచి బేక్ చేయాలి.
  9. తయారు ఐన తరువాత ముక్కలు చేసి సర్వ్ చేయాలి ...
  10. చాలా బాగుంటుంది స్పైసిగా చీజీ చీజీగా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర