హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్ అరిసెలు

Photo of Dry fruit ariselu by Sree Sadhu at BetterButter
1073
5
0.0(0)
0

డ్రై ఫ్రూట్ అరిసెలు

Jan-04-2019
Sree Sadhu
735 నిమిషాలు
వండినది?
90 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్ అరిసెలు రెసిపీ గురించి

ఇది చాలా కొత్తగా ఉంటుంది మరియు పిల్లలు కొత్తగా ట్రై చేసే వాళ్లు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. 500 గ్రాములు బియ్యం
  2. 250 గ్రాములు బెల్లం
  3. ½ tsp ఏలకుల పొడి
  4. కాజు పొడి 2 చెంచాలు
  5. బాదాం పొడి 2 చెంచాలు
  6. పిస్తా పొడి 2 చెంచాలు
  7. వాల్నట్ పొడి 2 చెంచాలు
  8. నూనె ఫ్రై ఫ్రై కి సరిపడా
  9. 2 చెంచాలు నువ్వులు
  10. 50 ఎం ల్ నీళ్లు

సూచనలు

  1. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి.
  2. ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి జల్లెడలో వేసి నీళ్ళు మొత్తం పూర్తిగా కారిపోయే వరకు ఉంచాలి.
  3. బియ్యాన్ని కొద్ది కొద్దిగా చిన్న మిక్సీ జార్ లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
  4. ఓకే గిన్నెలో బెల్లం తరుము వేసి పొయ్యి మీద ఉంచాలి.
  5. 40 నుండి 50 ఎం ల్ నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించాలి.
  6. ఇప్పుడు కరిగిన బెల్లం నీళ్ళను హై ఫ్లేమ్ మీద ఉంచి బుడగలు వచ్చే వరకు లేదా మరగడం మొదలయ్యే వరకు కాయాలి.
  7. ఒక సారి మరగడం మొదలవ గానే పాకాన్ని తిప్పుతూ ఉండాలి.
  8. ఇప్పుడు స్టవ్ ను సిమ్ లోకి తిప్పి, నెయ్యి మరియు ఏలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.
  9. అందులో కాజు పొడి బాదాం పొడి వాల్నట్ పిస్తా పొడి వేసుకోవాలి
  10. పాకం తయారు చేసిన గిన్నె మీద జల్లెడ ఉంచి అందులో నుండి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ జల్లించి
  11. పిండిని కలుపుతుండాలి.
  12. అది చపాతీ పిండిలాగా అవ్వాలి
  13. మీడియం సెగ మీద నూనె ని వేడి చేయాలి
  14. చేతి నిండా అరిసెల పిండి ని తీసుకొని గుండ్రంగా చేయాలి.
  15. అరిసెలు వత్తుకోవాలి
  16. అరిసెలను మెల్లగా నూనెలోకి జారవిడవాలి.నూనెలో వేయగానే అది మునిగి పోతుంది. కాబట్టి అది పైకి తేలే వరకు కదపకుండా ఆగాలి.
  17. రెండు వైపులా తిప్పుతూ సమంగా బంగారు రంగు లోకి మారే వరకు వేయించాలి.
  18. నూనె లో నుండి బయటకి తీశాక రెండు గరిటెల మధ్యన ఉంచి నూనంతా కారిపోయే వరకు గట్టిగా నొక్కాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర