Photo of khaman Dhokla. by Shobha.. Vrudhulla at BetterButter
758
9
0.0(0)
0

ఢోకలా

Jan-04-2019
Shobha.. Vrudhulla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఢోకలా రెసిపీ గురించి

యిది గుజరాతీ ఫేమస్ టిఫిన్..చాలా బాగుంటుంది. తినటానికి రుచిగా ఉంటుంది అందరికి కూడా..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • గుజరాత్
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. శనగ పిండి 2 కప్పులు
  2. గోధుమ నూక 2 చంచాలు
  3. సోడా అర చెంచా
  4. పంచదార 1 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. పెరుగు అర కప్పుడు
  7. పసుపు అర చంచాడు
  8. నూనె 3 చంచాలు
  9. నిమ్మకాయ రసం 2 చంచాలు
  10. నీళ్లు తగినన్ని
  11. పోపుకి సామాన్లు....
  12. ఆవాలు ఒక చెంచా
  13. పచ్చిమిర్చి 5 నిలువుగా తరిగి ఉంచుకోవాలి
  14. పంచదార 1 చంచ లేజ్ 2 చంచాలు కవలసినట్టుగా తీపి
  15. నీళ్లు ఒక గ్లాసుకొబ్బరి తురుము 2 చంచాలు
  16. కొత్తిమీర కొంచెం టాపింగ్ కోసం

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి,నూక,సోడా,పంచదార,పసుపు వేసి ఒకసారి కలిపాకా అప్పుడు పెరుగు ,నిమ్మ రసం వేసి మరో సారి బాగా కలియపెట్టి అప్పుడు నూనె వేసిబాగా కలపాలి
  2. బాగా కలపటం వల్ల ముద్ద బాగా స్మూత్ గా అయి కాస్త మెరుపులా వస్తుంది.
  3. దాన్ని అలా 10 to 15 mnts వరకు మూత పెట్టి ఉంచాలి
  4. ఈ లోపు స్టవ్ మీద ఢోకాల గిన్నీ పెట్టి నీళ్లు పోసిస్టవే కి సిమ్ లో పెట్టి ఉంచండి.అప్పుడు ఢోకాల ప్లేట్స్ కి బాగా నూనె రాసి తయారుగా ఉంచుకోండి.
  5. ఇప్పుడు 15 తరువాత యి ముద్ద మరో సారి కలిపి అందులో సోడా వేసికొంచెం నీళ్లుపోయండి.వెంటనే కలపటం మొదలు పెట్టాలి.కలుపు తుండగా పొంగుతూ ఉంటుంది.పొంగు పోయే వరకు కూడా కలప కూడదు దానివల్ల డోక్లా పొంగదు.
  6. వెంటనే ఈ ముద్దని ప్లేట్స్ లోకి పోసి కాస్త వెలితిగా గిన్నెలో పెట్టి మూత పెట్టి 10 mnts వరకు స్టీమ్ మిద ఉడికించాలి.
  7. ఇప్పుడు టూత్పిక్ పెట్టి ఉడికిందో లేదో చూడాలి.ఉడికితే దించి చల్లార్చి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి..
  8. నేను బౌల్స్ లోని మరియు కేక్ టీన్ లోని వేడి చేసాను మంచి షేప్ వస్తుందని
  9. ఇప్పుడు కట్ చేసాక పోపు వేయాలి.పోపు నూనెలో ఆవాలు వేసి వేగాక మిర్చి వేసి వేగనిచేక అందులో నీళ్లు పోసి పంచదార. వేయాలి.బాగా మరిగకా ఆ నీలకని పోపు కలిపి ఢోకాల మీద బాగా వేయాలి అంత కవర్ చేస్తూ.
  10. ఆఖరికి వాటిమీద కొబ్బరి తురుము వేసి కొత్తిమీర వేసి తింటే చాలా బాగుంటుంది
  11. అంటే ఏంటో రుచి అయిన గుజరాతీ ఢోకాల రెడి.గ్రీన్ చుటనీ తో తింటే చాలా బాగుంటుంది.
  12. కొబ్బరి తురుము పచ్చిది అయిన ఎండు ది అయిన పర్వాలేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర