హోమ్ / వంటకాలు / వెజ్ అమెరికన్ చోప్సీ

Photo of Veg American chopsuey  by Swapna Tirumamidi at BetterButter
693
6
0.0(0)
0

వెజ్ అమెరికన్ చోప్సీ

Jan-04-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ అమెరికన్ చోప్సీ రెసిపీ గురించి

ఇది ఇటాలియన్ మరియు చైనీస్ రుచులు కలబోసిన అమెరికన్ వంటకం.చాలా రుచిగా మంచి ఆకర్షణీయంగా ఉంటుంది.కరకర లాడే నూడుల్స్ మరియు రంగురంగుల కూరలతోచేసిన సాస్ తో చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యకరం కూడా ఎందుకంటే 3..4 రకాల కాయగూరలు వాడుతాము కదా పిల్లలు చాలచాలా ఇష్టపడే వంటల్లో ఇదొకటి.దీన్ని భోజనం లా కానీ,అల్పాహారంలా కానీ స్వీకరించవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అమెరికన్
  • మిళితం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. నూడుల్స్(నేను మాగి చిన్న పాకెట్స్ వాడాను) 4
  2. కార్న్ ఫ్లోర్ 2 పెద్ద చెంచాలు
  3. నూని ఒక చెంచా
  4. నీళ్లు 5 కప్పులు
  5. ఉప్పు ఒక చెంచా
  6. వేయించడానికి తగినంత నూని
  7. సాస్ కోసం...నూని 2 చెంచాలు
  8. సన్నగా తరిగిన వెల్లుల్లి 1 చెంచా
  9. సన్నగా తరిగిన ఉల్లి కాడలు 3 చెంచాలు
  10. సన్నగా పొడవుగాతరిగిన కేరేట్ 3 పెద్ద చెంచాలు
  11. సన్నగా పొడవుగా తరిగిన క్యాబేజీ 3 పెద్ద చెంచాలు
  12. పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు3 చెంచాలు
  13. క్యాప్సికం ముక్కలు 3 చెంచాలు
  14. తమాట కచప్ అర కప్పు
  15. వెనిగర్ ఒక పెద్ద చెంచా
  16. సోయసాస్ ఒక పెద్ద చెంచా
  17. షెజవాన్ సాస్ అర చెంచా
  18. ఉప్పు అర చెంచా
  19. మిరియాల పొడి పావు చెంచా
  20. పంచదార 1 పెద్ద చెంచా
  21. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు.

సూచనలు

  1. ముందుగా పెద్దగిన్ని లో 5 కప్పుల నీళ్లు పోసి,ఒక చెంచా నూని,ఒకచెంచా ఉప్పు వేసి మరిగించి నూడుల్స్ విరవకుండా వేసి 4 నిమిషాలు ఉడికించాలి.
  2. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒక మనిషికి ఒక నూడిల్స్ ప్యాకెట్ చప్పున తీసుకుంటే వాటిని నూనెలో వేయించే ముందు అన్ని భాగాలు చేసుకోవాలి అంటే ఉదాహరణకు మీ ఇంట్లో ఆరుగురు ఉంటే ఉడికించి కార్న్ ఫ్లోర్ పట్టించిన నూడిల్స్ ని 6 భాగాలు చేసుకుని వేయించి పెట్టుకోవాలి ఒకవేళ ఒక్కొక్కరికి 2 కావాలి అంటే 2×6 12 భాగాలు చేసుకొని వేయించుకోవాలి.
  3. తరువాత స్టీలు జల్లెడలో వేసి నీరంతా జారిపోయాక చల్లటి నీళ్ళు పోసి నీరు ఓడనివ్వాలి.
  4. ఇప్పుడు మూకుడుపెట్టి వేయించడానికి తగు నూని పోసి వేడి చెయ్యాలి.
  5. ఈ లోగా నూడుల్స్ లో నీరుపోయి ఉంటుంది.ఆ నూడుల్స్ కి 2 పెద్దచెంచాల కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి.నూడిల్స్ అంతటా పిండి అంటేలా.
  6. ఇప్పుడు వాటిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కభాగాన్ని వేడి నూనెలో వేసి వేయించాలి.ఒకే ముద్దలా వేయకుండా జంతిక వేసినట్టు వెడల్పు గా వేసి వేయించాలి. బాగా ఎర్రగా కాకుండా ఒక మాదిరి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు .
  7. ఒకపక్క వేగాక రెండో పక్కకు కూడా తిప్పి కరకరలాడేలా వేయించాలి.
  8. ఇలా 4 భాగాలు కూడా...4 జంతికల చుట్ట లా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  9. ఇప్పుడు సాస్ సంగతి చూద్దాం.... పొయ్యిమీద మూకుడు పెట్టి 2 చెంచాల నూని వేసి వేడిచేసి...వెల్లుల్లి తరుగు,ఉల్లికాడల తరుగువేసి ఒకసారి వేయించాలి.
  10. ఇప్పుడు కేరేట్,క్యాబేజీ ,ఉల్లిపాయ,క్యాప్సికం ముక్కలను ఒకటి తరువాత ఒకటిగా వేసి కాస్త ఉప్పు వేసి 3 నిమిషాలు వేయించాలి...మూత పెట్టకూడదు...కూరముక్కలు బాగా మెత్తగాకూడా వేయించకూడదు.కాస్త కసకస లాడుతూనే ఉండాలి.
  11. ఇప్పుడు టమాటాకచప్ వేసి కలిపి...సోయా సాస్,మిరియాలపొడి,షెజవాన్ సాస్,వెనిగర్,ఉప్పు,పంచదార లను ఒక దానితరువాత ఒకటిగా వేసి బాగాకలిపి ఒక నిమిషం ఉడకనివ్వాలి..
  12. ఇప్పుడు 2 చెంచాల కార్న్ ఫ్లోర్ లో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపి ఉడుకుతున్న సాస్ లో పోసి కలుపుతూ 3..4.. నిమిషాలు ఉడకనివ్వాలి.
  13. 3..4 నిమిషాల లో సాస్ కొద్దిగా చిక్కపడ్డాక పొయ్యి ఆపేసి దించి కాసరోల్ లో పోసి ఉంచుకోవాలి.
  14. ఇక సాస్ తయారైంది...కరకరలాడే నూడుల్స్ కూడా సిద్దంగావున్నాయి కదా...ఇప్పుడు సూప్ ప్లేటు లోగాని, కాస్త లోతు వెడల్పు ఉన్న పాత్రలోగాని ఈ సాస్ ని రెండు గరిటలు పోసి వేయించిన నూడుల్స్ చుట్టని సాస్ లో పెట్టి ఉల్లికాడల తరుగు తో అలంకరించి వడ్డిస్తే.... పిల్లలేమిటి పెద్దలుకూడా వేళ్ళు నాక్కుంటూ తినాల్సిందే...అంత బావుంటుంది.
  15. ఇది వేడి వేడి గానే తినాలి..అలాగే బావుంటుంది కూడా...ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే...తినేవారు ఎవరైనా సరే డైనింగ్టేబుల్ దగ్గర సిద్ధంగా ఉన్నప్పుడే వేడిసాస్ లో వేయించిన నూడిల్స్ వేసి వడ్డించండి...అంతవరకు సాస్ ...నూడిల్స్ రెండూ విడి విడిగానే ఉంచాలి...లేకపోతే నూడుల్స్ మెత్తబడి పోతాయి...ఇదే చిట్కా...అక్కడ ఇన్ని అక్షరాలు సరిపోవని ఇక్కడే రాసాను.చిట్కా కొలం లో ఇంకోచిన్న విషయం రాస్తాను...మరి వెజ్ అమెరికన్ చోప్సీ ఎలావుందో చెప్పండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర