హోమ్ / వంటకాలు / పెసరట్టు ఉప్మా

Photo of Pesarattu upma by Anitha Rani at BetterButter
2305
4
0.0(0)
0

పెసరట్టు ఉప్మా

Jan-05-2019
Anitha Rani
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరట్టు ఉప్మా రెసిపీ గురించి

పెసరట్టు ఉప్మా ఒక సాంప్రదాయక వంటకము/టిఫిన్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చేస్తారు.దోస లోపల ఉప్మా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పెసరట్టు....
  2. పెసలు/పెసరపప్పు 1 కప్
  3. బియ్యము 2స్పూన్స్
  4. ఉప్పు.సరిపడా
  5. 1 అల్లము ముక్క
  6. 6 తరిగిన పచ్చి మిర్చి ముక్కలు
  7. 1కప్ తరిగిన ఉల్లిపాయముక్కలు
  8. టమోటో 1
  9. నూనె సరిపడా
  10. రవ్వ 1కప్
  11. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  12. పోపు గింజలు 1స్పూన్
  13. కరివేపాకు 4 రెమ్మలు
  14. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. పెసరపప్పు ,బియ్యము ను 4 గంటలు నానబెట్టాలి.
  2. నీరు వంపుకొని మిక్సీ కప్ లో వేసుకోవాలి.
  3. అందులో జీలకర్ర,అల్లము తురము,పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా పిండి రుబ్బుకోవాలి.
  4. పిండి ని వేరే గిన్నె లో కి తీసుకొని ఉప్పు,ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  5. ఉప్పు చూసి వేసుకొని కలిపి పక్కన పెట్టు కోవాలి.
  6. ఉప్మా తయారీ.
  7. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక నూనె వేసి అందులో పోపు గింజలు వేసి వేగాక కరివేపాకు వేయాలి.
  8. తరువాత ఉల్లిపాయముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు వేసి వేపుకోవాలి.
  9. తరువాత టమోటా ముక్కలువేసి వేపుకోవాలి. దానిలో 3 కప్పుల నీరు పోయాలి.
  10. నీరు మరిగిన తరువాత ఉప్పు,రవ్వ వేసి కలిపి మంట తగ్గించి 5ని తరువాత కలిపి పక్కన పెట్టు కోవాలి.
  11. స్టవ్ పైన దోస పెనము పెట్టుకొని వేడి అయ్యాక పెసరట్టు పిండిని గరిట తో పెనము మీద వేసి రుద్దాలి.చివరలో నూనె/నెయ్యి వేసుకోవాలి.
  12. రెండు వైపులా వేపుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు,అల్లము తురుము,వేసి కొద్దిగా నెయ్యి వేసి చిన్న మంట పైన 1ని ఉంచాలి.
  13. పెనము పైన పెసరట్టులో ఉప్మా పెట్టి మడత వేసుకొని తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి.
  14. ఈ విధముగా అన్ని చేసుకోవాలి.
  15. పెసరట్టు ఉప్మాతో పాటు అల్లము పచ్చడి,పచ్చి కొబ్బరి పచ్చడి,టమోటో పచ్చడి తో తింటే రుచి గా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర