హోమ్ / వంటకాలు / శెగోడీలు(చుట్లు)

Photo of Rings by sneha gilla at BetterButter
469
4
0.0(0)
0

శెగోడీలు(చుట్లు)

Jan-05-2019
sneha gilla
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శెగోడీలు(చుట్లు) రెసిపీ గురించి

బియ్యపుపిండి తో చేసుకుంటాము.ఇవి సాంప్రదాయ వంటకం. వీటిని పండుగలకు ఎక్కువగా చేసుకుంటాము.వీటిని చేతితో చేసి చుట్టుకుంటాము కాబట్టి చుట్లు అని కూడా అంటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపు పిండి 2 కప్స్
  2. ఉప్పు 2 స్పూన్స్
  3. కారం 2 స్పూన్స్
  4. నువ్వులు 2 స్పూన్స్
  5. ఓమ 1 స్పూన్
  6. జీరా 1 స్పూన్
  7. వేడినీళ్లు పిండి తడుపుకోడానికి సరిపడా
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు,కారం,జీరా,ఓమ వేసి కలిపి వేడి నీళ్ళు పోసి పిండిని ముద్దలా కలుపుకోవాలి.
  2. పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే తడుపుకోవాలి.
  3. ఇప్పుడు చపాతీ పీఠ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసి కొద్దిగా పిండి తీసుకొని తాల్చుకోవాలి.
  4. అలా తాల్చుకొని వాటిని చుట్టుకోవాలి.
  5. ఆ విదంగా అన్ని తాల్చి చుట్టుకొని పెట్టాలి.
  6. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టి వేడయ్యాక ముందుగా చుట్టిపెట్టుకున్న వాటిని వేసి ఎరుపు రంగు వచ్చేదాకా వేయించాలి.
  7. ఇవి డబ్బాలో నిల్వ చేసుకుంటే 15 రోజుల వరకు ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర