హోమ్ / వంటకాలు / సెనగపప్పు కబాబ్

Photo of Chana dal kebab  by Harini Balakishan at BetterButter
599
1
0.0(0)
0

సెనగపప్పు కబాబ్

Jan-05-2019
Harini Balakishan
135 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెనగపప్పు కబాబ్ రెసిపీ గురించి

ఫుల్ ప్రోటాన్ , నో కార్బోహైడ్రేట్ రెసిపీ. పిల్లలు వరైటీ కోరుకుంటారుగా. ఇది ఒక టేస్టీ ఉపాయం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • దోరగా వేయించటం
  • మిళితం
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. సెనగ పప్పు ఒక కప్పు
  2. పసుపు చిటికెడు
  3. ఉప్పు రుచికి
  4. సన్నగ తరిగిన ఉల్లిగడ్డ అర కప్పు
  5. సన్నగ తరిగిన కొత్తిమీర పావు కప్పు
  6. సన్నగ తరిగిన పుదీన పావు కప్పు
  7. మూడు పచ్చి మిర్చీ తరిగినవి
  8. ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు
  9. రెండు చంచా సెనగ పిండి
  10. ధనియా రెండు చంచా
  11. జిలకర రెండు చంచా
  12. మూడు ఎండు మిర్చీ
  13. చిన్న దాల్చిన్ చెక్క
  14. రెండుఇలాచీ
  15. రెండు లవంగాలు
  16. శాలో ప్రైకి నూనె

సూచనలు

  1. ముందుగ ధనియా, జిలకర, ఎండుమిర్చీ, లవంగాలు, ఇలాచీ, చెక్క అన్నీ పొడిగా వేయించాలి
  2. చల్లారాక పొడి కొట్టాలి
  3. నానేసిన సెనగ పప్పును నీరు వార్చి కొద్ది గ నూనె వేసి మెత్తగా ఉడకబెట్టాలి
  4. నీరు లేకుండ వడగట్టాలి
  5. రెండు చంచా నూనె వేడి చేసి, ఉల్లి తరుగు, పచ్చి మిర్చీ, వెల్లుల్లి వేసి దోరగా వేపాలి
  6. చిటికెడి పసుపు, సరిపడ ఉప్పు వేసి, ఉడికించిన సెనగ పప్పు వేసి నీరు ఇంకేవరకు వేపాలి
  7. పై మిశ్రమాన్ని బరకగా రుబ్బుకుని, రెండు చంచా సెనగ పిండి, కొత్తిమీర, పుదీన, మసాల పొడి వేసి కలపాలి
  8. కబాబ్ ఆకారంలో వత్తి రెండు వైపుల దోరగా శాలో ఫ్రై చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర