మామిడికాయ పులిహోర | Mango rice Recipe in Telugu

ద్వారా sneha gilla  |  5th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mango rice by sneha gilla at BetterButter
మామిడికాయ పులిహోరby sneha gilla
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

మామిడికాయ పులిహోర వంటకం

మామిడికాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango rice Recipe in Telugu )

  • వేయించిన కాజు అలంకరణకు
  • కరివేపాకు 2 రెమ్మలు
  • శనిగపప్పు 2 స్పూన్స్
  • పల్లీలు 2 స్పూన్స్
  • మిరియాలపొడి 1/2 స్పూన్
  • నువ్వులపొడి 1 స్పూన్
  • ఉప్పు సరిపడా
  • ఎండుమిర్చి 2
  • పచ్చిమిర్చి 4
  • ఆవాలు, జీరా 1 స్పూన్
  • పసుపు 1 స్పూన్
  • ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  • అన్నం 2 కప్స్
  • పుల్లటి మామిడికాయ తురుము 1/2 కప్

మామిడికాయ పులిహోర | How to make Mango rice Recipe in Telugu

  1. ముందుగా అన్నం పొడిపొడిగా వండి విడదీసి పెట్టుకోవాలి.
  2. మామిడికాయను తురిమి పెట్టుకొవాలి.పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక పోపుదినుసులు వేసి వేయించాలి.
  4. తర్వాత పచ్చిమిర్చి,ఎండుమిర్చి, పల్లీలు,శనిగపప్పు,కరివేపాకు,మిరియాలపొడి,ఉప్పు,పసుపు వేసి వేగనివ్వాలి.
  5. అది వేగాక మామిడికాయ తురుము,నువ్వులపొడి వేసి కలిపి స్టవ్ చేయాలి.
  6. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అన్నంలో ఈ పోపు మిశ్రమం వేసి పైనుంచి కాజు వేసి సర్వ్ చేసుకోండి.

నా చిట్కా:

పులుపు ఇష్టపడేవారు ఇంకా కొంచెం మామిడికాయ తురుము ఆడ్ చేసుకోవచ్చు.

Reviews for Mango rice Recipe in Telugu (0)