హోమ్ / వంటకాలు / పాకం మొక్కజొన్న పేలాలు

Photo of Caramel popcorn  by Pravallika Srinivas at BetterButter
696
4
0.0(0)
0

పాకం మొక్కజొన్న పేలాలు

Jan-05-2019
Pravallika Srinivas
2 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం మొక్కజొన్న పేలాలు రెసిపీ గురించి

పోప్ కార్న్ నచ్చని పిల్లలు ఉండరు.కాకపోతే మనం ఇంట్లో చేయడం కష్టం అనుకుంటాం.చాలా సులభంగా చేసుకోవచ్చు.మొక్కజొన్నలు పిల్లలకు చాలా బలమైన పదార్ధం.మొక్కజొన్న కండెలు అలా నిప్పుల మీద కాల్చిన ,ఉడికించినా చాలా రుచిగా ఉంటాయి.ఈ గింజలు ఎండబెట్టి వేపితే పేలాలు వస్తాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మొక్కజొన్న గింజలు - 1 కప్పు
  2. వెన్న - 2 స్పూన్లు
  3. నూనె - 2 స్పూన్లు
  4. పంచదార - 1 కప్పు

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ గిన్నీలో వెన్న,నూనె వేసి కరగనివ్వాలి.
  2. ఇప్పుడు పెద్ద మంట మీద ఎండిన మొక్కజొన్న గింజలను కుక్కర్ గిన్నీలో వేసి కలిపి 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి.
  3. కుక్కర్ మూత గాస్కెట్,వెయిట్ తీసేసి తిప్పి పెట్టి మీడియం మంట మీద పెట్టుకోవాలి.
  4. రెండు మూడు సెకండ్ల తర్వాత గింజలు పేలి పేలాలు లాగా పొంగుతూ ఉంటాయి.
  5. అలా మొత్తం పొంగే వరకు మూత తీయకూడదు.లేదంటే మీదకు చిందే అవకాశం ఉంది.
  6. శబ్దం ఆగింది అంటే అన్ని పేలాలు అయ్యాయి అని అర్థం స్టవ్ ఆపి వేరొక గిన్నీలో పేలాలు వేసుకోవాలి.
  7. ఇప్పుడు అదే కుక్కర్ లో పంచదార వేసి చిన్న మంట మీద నీరు లేకుండా కరిగించాలి.
  8. ఇలా కరిగిన పంచదారని caramelisation అని ఆంగ్లంలో అంటారు .ఎర్రగా పాకం వచ్చాక పేలాలు వేసి కలుపుకోవాలి.
  9. 2 నిమిషాలు చల్లారనిచ్చిన తర్వాత వడ్డించి తినేయడమే.
  10. వీటిని పిల్లలకు సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక ఇస్తే చాలా ఇష్టంగా తింటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర