హోమ్ / వంటకాలు / సెమియా కప్ బర్ఫీ

Photo of Semiya cup burfi by Swapna Tirumamidi at BetterButter
506
6
0.0(0)
0

సెమియా కప్ బర్ఫీ

Jan-05-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమియా కప్ బర్ఫీ రెసిపీ గురించి

ఇదిచాల సులువుగా చేసుకునే స్వీట్.పిల్లలకు పార్టీలు చేసినప్పుడు స్వీట్ ఐటెంగా పెట్టడానికి ఇది చక్కగా ఉంటుంది. డ్రైగా ఉంటుంది,పాకం కారిపోతుంది అనే భయముండదు .చేతికి అంటుకోదు కాబట్టి పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా హాయిగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మిడిల్ ఈస్టర్న్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. రోస్టెడ్ ఫైన్ వెర్మిసెల్లి 200 గ్రా
  2. నెస్ట్లే మిల్క్ మెయిడ్ 350 గ్రా
  3. డ్రై కోకనట్ పొడి ఒక కప్
  4. నెయ్యి 4 చెంచాలు
  5. డ్రై ఫ్రూట్స్( నచ్చినవి ఏవైనా సరే)
  6. యాలకుల పొడి అర చెంచా.

సూచనలు

  1. ముందుగా 4 చెంచాల నెయ్యి వేడిచేసి వెర్మిసెల్లిని చిన్నచిన్నగా చితిపి దోరగా వేయించాలి 5 నిమిషాలు పాటు.
  2. ఇప్పుడు డ్రై ఫ్రూప్ట్స్ ని మిక్సీలో వేసి కాస్త పలుకు పలుకు గా చేసుకోవాలి.
  3. ఇప్పుడు వేయించిన వెర్మిసెల్లి లో డ్రై కొబ్బరి పొడి,యాలకులపొడి,డ్రై ఫ్రూట్స్ పొడిని వేసి కలిపి...ఇప్పుడు మిల్క్ మెయిడ్ వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి...ఒక పెద్ద చెంచాడు చప్పున లేదా మీకు కావలసిన పరిమాణంలో తీసికుంటు ముఫిన్ పేపర్ కప్పుల్లో పెట్టి నొక్కాలి.
  4. ఇప్పుడు పైన కాస్త డ్రై ఫ్రూట్స్ పొడిని చల్లి కాజు లేదా కిస్మిస్ లతో అలంకరించి డబ్బాలో పెట్టుకుంటే ....కవలసినప్పుడు తీసి ఠక్కున నోట్లో పడేసుకోవచ్చు...పేపర్ కప్ ఉండటం వల్ల చేతికి అంటదు...చేయి కడిగే పనిలేదు... మాటి మాటికి చేతులు కడుక్కో అంటుంటే పిల్లలకి మహా విసుగుకదా:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:.అందుకే ఇలాంటి ఐటమ్స్ పిల్లలకి బాగా నచ్చుతాయి.రుచి కూడా చాలా బావుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర