మిర్చి బజ్జి | Mirchi bajji Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  5th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mirchi bajji by Kavitha Perumareddy at BetterButter
మిర్చి బజ్జిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

23

0

మిర్చి బజ్జి వంటకం

మిర్చి బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mirchi bajji Recipe in Telugu )

  • సేనగపిండి పావుకిలో
  • లావు మిర్చి పావుకిలో
  • ఉప్పు తగినంత
  • సోడాపోడి పావు స్పున్
  • వాము స్పున్
  • నూనె డీప్ ప్రై కు సరిపడా
  • ఉల్లిపాయలు ముక్కలు ఒక కప్
  • నిమ్మకాయ 1

మిర్చి బజ్జి | How to make Mirchi bajji Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో సేనగపిండి జల్లిచుకొని దానిలోఉప్పు,సోడాపోడి, వాము వేసి కలపాలి తరువాత తగినంత నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. మరీ జారుడుగా ఉండకూడదు పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. అప్పుడు బజ్జిలు బాగా పొంగుతాయి.
  2. తరువాత మిరపకాయలు కడిగి చివరలు కట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి తగినంత నూనె వేసుకొని బాగకాగిన తరువాత సేనగపిండి లో మిరపకాయ ను ముంచి నిదానంగా జారవిడుచుకుంటు వేసుకోవాలి.మంచిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
  4. తరువాత బజ్జిలను కత్తితో నిలువుగా చీలికపెట్టుకొని దాని లో ఉల్లిపాయలు వేసుకోవాలి.దాని పైన మసాలా కారం నిమ్మరసం చల్లుకోవాలి. వేడి వేడి గా సర్వ్ చేయాలి.

నా చిట్కా:

మిరపకాయలు కట్ చేయకుంటే నూనె లో వేసినప్పుడు పేలుతాయి .కచ్చితంగా కట్ చేసుకోవాలి.

Reviews for Mirchi bajji Recipe in Telugu (0)