నూడిల్స్ బోండా | Noodles bonda Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  5th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Noodles bonda by Pasumarthi Poojitha at BetterButter
నూడిల్స్ బోండాby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

6

0

నూడిల్స్ బోండా వంటకం

నూడిల్స్ బోండా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Noodles bonda Recipe in Telugu )

  • నూడిల్స్ ఇపి 1 ప్యాకెట్
  • ఉల్లిపాయ 1 సన్నగా టారుగుకోవాలి
  • క్యారెట్ 1 తురుము
  • పచ్చి మిర్చి 1 కట్ చేసినవి
  • కొత్తిమీర కొద్దిగా
  • మైదా 2 టేబుల్ స్పూన్స్
  • కారం 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు సరిపడా
  • సొయా సాస్ 1 టేబుల్ స్పూన్
  • చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్
  • నూనె వేయించడానికి సరిపడా
  • నీళ్లు 1 కప్
  • వాము 1 టేబుల్ స్పూన్
  • సోడా ఉప్పు కొద్దిగా
  • శనగ పిండి 1 కప్

నూడిల్స్ బోండా | How to make Noodles bonda Recipe in Telugu

  1. ముందుగా పోయి వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి కొంచం ఉప్పు వేయాలి నీళ్లు కాగిన తర్వాత నూడిల్స్ వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఉడికినిన తర్వాత వడాపోసుకొని నీళ్లు పోయాక ప్లేట్ లో కి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి వేడి అయ్యాక తరిగిన ,ఉల్లిపాయ ,పచ్చి మిర్చి,క్యారెట్ తురుము,ఉప్పు వేసి వేగనివ్వాలి,ఇప్పుడు కొంచం మైదా వేసుకోవాలి.
  3. అన్ని వేగిన తర్వాత ఉడికించిన నుడుల్స్ కలై లో వేసుకొని ఇంకా కొంచం ఉప్పు,సొయా సాస్,చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నూడిల్స్ మిశ్రమం అంత ఒక గిన్నె లో కి తీసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ముద్ద ల.
  4. ఇప్పుడు ఒక గిన్నె లో శనగ పిండి 1 కప్ వేసుకొని అందులో ఉప్పు,వాము ,కారం వేసుకొని గారిట జరుగా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు ఇప్పి ముద్ద ని గుండ్రంగా ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.
  6. ఇప్పుడు పోయి పై కలై పెట్టుకొని నూనె వేసుకొని వేడి అయ్యాక ఆ ఉండలను పిండి లో ముంచి కాగే నూనె వేసుకొని కలర్ మారె వరకు వేయించుకోవాలి.
  7. వేడి వేడి గా సాస్ తో తింటే చాలా బాగుంటాయి.

Reviews for Noodles bonda Recipe in Telugu (0)