హోమ్ / వంటకాలు / మెక్సికన్ సలాడ్ రోస్ట్ చీజ్ దోస

Photo of Mexican salad roast dosa with cheese. by Swapna Tirumamidi at BetterButter
2598
3
0.0(0)
0

మెక్సికన్ సలాడ్ రోస్ట్ చీజ్ దోస

Jan-05-2019
Swapna Tirumamidi
300 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెక్సికన్ సలాడ్ రోస్ట్ చీజ్ దోస రెసిపీ గురించి

ఇది మెక్సికన్ సలాడ్ రుచిని దక్షిణ భారతీయ రుచులను జోడిస్తూ చేసే ప్రయత్నంలో సృష్టించిన ఒక అద్భుతమైన దోస రుచి ఆమోఘం. పిల్లలు కాదనకుండా తినేస్తారు.దోస ప్లాజా వారిని రిక్వెస్ట్ చేస్తే ఈ రెసిపిని నాకు ఇచ్చారు...దాన్ని మీతోపంచుకుంటున్నాను.మీరు చూసి ,చేసి ఎలావుందో చెప్పండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దోస కోసం...ఛాయమినపప్పు ఒక కప్పు
  2. బియ్యం 3 కప్పులు
  3. మెంతులు అర చెంచా
  4. ఉప్పు సరిపడా
  5. కందిపప్పు,శెనగపప్పు చెరో 2 చెంచాలు.
  6. పంచదార 2 చెంచాలు.
  7. మెక్సికన్ సలాడ్ కోసం..వెజ్ మాయినిస్ ఒక కప్పు
  8. సన్నగా కోరిన చీజ్ ఒక కప్పు.
  9. సాల్సా మెక్సికన్ సాస్ 2 చెంచాలు(నేను రెడీమేడ్ ది వాడాను)
  10. జలపెనో 2
  11. ఐస్ బెర్గ్ లెత్తుస్ సన్నగా తరిగినది 1కప్పు
  12. ఉల్లికాడల తరుగు అర కప్పు
  13. కేరేట్ ,క్యాబేజీ,క్యాప్సికం 3కలిపిన తరుగు ఒక కప్.
  14. టమాటా కచుప్ 2 చెంచాలు(ఇష్టం ఉంటేనే వాడండి)
  15. నెయ్యి అర కప్పు
  16. ఉప్పు 2 చిటికెలు
  17. పంచదార అర చెంచా
  18. వెడల్పుగా, సమాంతరంగా ఉన్న పెద్ద పెనం ఒకటి.

సూచనలు

  1. ముందుగా దోస కోసం చెప్పిన పదార్థాలు...పంచదార,ఉప్పు మినహా మిగతా అన్నీ శుభ్రంగా కడిగి చాలినన్ని నీళ్లు పోసి 3 గంటలు నాన పెట్టి బాగా మెత్తగా రుబ్బి ,ఉప్పుకలిపి 2 గంటలు వెచ్చని ప్రదేశంలో మూత పెట్టి ఉంచాలి.కాస్త చిక్కగానే రుబ్బుకోవాలి.
  2. గంటన్నర దాటాక దోసెలపిండి లో పంచదార కలిపి ఉంచాలి.కిందనుండి పైవరకు పిండిని బాగా 5 ..6 సారులు కలిపి ఉంచాలి.పిండి మరీ గట్టిగావుంటే కాసిన్ని నీళ్లు పోసి ఇడ్లిపిండికన్న కాస్త పలుచగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా పొడవుగా తరిగిన కూరముక్కలు, ఉప్పు,కొద్దిగా చీజ్, వెజ్ మయోనిస్, సాల్సా మెక్సికన్ సాస్,టమాటా కచుప్,జలపెనో ముక్కలు(ఇవి కొన్ని చాలా కారంగా ఉంటాయి కాబట్టి చూసి వాడుకోవాలి)ఐస్ బర్గ్ లెట్టుస్ సన్నని తరుగు వేసి,కొన్ని ఉల్లికాడల ముక్కలు కూడా వేసి బాగా కలిపి పావు చెంచా పంచదార వేసి బాగా కలిపి ఉంచాలి..(ఈ మిశ్రమం క్రీమ్ ఎక్కువగా కూరలు కాస్త కనపడి కనడనట్టుగా గా ఉండాలి.కాబట్టి మయోనిస్ ని కాస్త ఎక్కువగానే ఉంచుకోండి...అవసరాన్నిబట్టి వాడుకివచ్చు.)
  4. ఇప్పుడు పెనం పొయ్యిమీద పెట్టి వేడి చేసి కాస్త బటర్ రాసి పేపర్ టవల్ తో తుడిచి మరొకసారి వేడి చెయ్యాలి...సన్నని మంట మీద ఉంచి ఇప్పుడు దోస పిండిని తీసుకుని దోసలా వెయ్యాలి మరీ పలుచగా వెయ్యకూడదు ఎందుకంటే కూరలు అవి ఉన్నాయికదా పలుచని దోస చిరిగి పోతుంది.దోస వేసాక 60 శాతం దోస కాలిన తరువాత బటర్ వేసి,4 చెంచాల మయోనిస్ మిశ్రమాన్ని దోస అంతటా పరచి సన్న సెగ మీద ఎర్రగా కాల్చుకోవాలి.
  5. దోస తిరగెయ్యకూడదు...ఇలా ఎర్రగా కాలిన తరువాత దోసని ఒక పక్కనుంచి గుండ్రంగా చుట్టి ఒక గొట్టంలా చెయ్యాలి.
  6. దోస సైజుని బట్టి మూడు లేదా ,నాలుగు సమాన ముక్కలుగా అయిమూలగా (క్రోస్ గా)అట్లకాడతో కోసుకుని ప్లేటులో పెట్టి పైన కాస్త చీజ్... ఉల్లికాడలు వేసి అలంకరించుకోవాలి.అంతే మెక్సికన్ సలాడ్ రోస్ట్ చీజ్ దోస తయారైపోయింది .దీనికి ప్రత్యేకంగా చట్నీ లు అవి అక్కర్లేదు. కావాలంటే చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర