హోమ్ / వంటకాలు / ముల్లంగి పరాటా

Photo of Radish parota by kalyani shastrula at BetterButter
467
5
0.0(0)
0

ముల్లంగి పరాటా

Jan-07-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి పరాటా రెసిపీ గురించి

గోధుమపిండి ,ముల్లంగి తో చేసే చపాతీ

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తురిమి పెట్టుకున్న నాలుగు పెద్ద ముల్లంగి తురుము ఒక కప్పు
  2. రెండు కప్పుల గోధుమపిండి
  3. నాలుగు పచ్చిమిర్చి
  4. రెండు స్పూన్ ల నువ్వులు
  5. ఉప్పు సరిపడా
  6. పసుపు చిటికెడు
  7. ఇంగువ చిటికెడు
  8. జిలకర
  9. అవు నెయ్యి /నూనె
  10. కొత్తిమీర తరుగు సగం కప్
  11. రైటా కొరకు పెరుగు ,గాజర్ తురుము

సూచనలు

  1. మొదలు ముల్లంగి పొట్టుతీసి తురుముకొని ఉప్పు కలిపి నీళ్లు పిండి పెట్టుకోవాలి .అందులో పచ్చిమిర్చి ,ఇంగువ ,పసుపు ,జిలకర ,నువ్వులు ,కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి .
  2. తరిగిన పచ్చిమిర్చి వగైరా
  3. అన్నీ కలిపి ఉంచుకోవాలి
  4. ముల్లంగి పిండగా వచ్చిన నీరు ,ఇంకా కొంచెం నీటిని ఉపయోగించి గోధుమపిండితో ఉప్పువేసి కలిపి పెట్టుకోవాలి
  5. గోధుమపిండితో రొట్టెలు గా ఒత్తి పెట్టుకోవాలి
  6. ఒక రోటి తీసుకొని అందులో పైన తయారుచేసుకున్న ముల్లంగి మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేయాలి
  7. ఇప్పుడు దీనిమీద మరొక రోటి ఉంచి చుట్టూ ఊడకుండా ఒత్తాలి
  8. ఇప్పుడు దీనిని వేడి ఇనుప పెనం మీద వేసి చిన్న మంటలో కాల్చాలి
  9. ఒకవైపు కాల్చక రెండవ వైపు తిప్పి కాస్త అవు నెయ్యి వేసి కాల్చాలి
  10. ఇలాగ రెండువైపులా బాగా కాలాక తీసి ఇంకొకటి వేసుకోవాలి
  11. రైటా కొరకు గాజర్ తురిమి అందులో పెరుగు ,ఉప్పు ,వేసి పోపు పెట్టుకోవాలి
  12. ఎంతో ఆరోగ్యకరమైన ,రుచికరమైన ముల్లంగి పరాటా లు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర