హోమ్ / వంటకాలు / చోడిపిండి తో జావా

Photo of Ragi malt  by Shobha.. Vrudhulla at BetterButter
896
4
0.0(0)
0

చోడిపిండి తో జావా

Jan-08-2019
Shobha.. Vrudhulla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చోడిపిండి తో జావా రెసిపీ గురించి

చోడిపిండి పిండి లో ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది.అన్ని వయసులో వాళ్ళు కూడా తాగొచ్చు.చాలా రుచిగా కూడా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • సూపులు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. చోడిపిండి 2చంచాలు
  2. పాలు 2 గ్లాసులు /అర లీటరు
  3. పంచదార 6 చంచాలు లేక మీకు తగినంత తీపి వేసుకోవచ్చు
  4. యాలుకల పొడి 1 చెంచా
  5. డ్రైఫ్రూట్ పొడి 2 చంచాలు.
  6. అర గ్లాసు నీళ్లు పొడి కలపటానికి.

సూచనలు

  1. ముందుగా చోడిపిండి ని నీళ్ళల్లో బాగా కడిగి మళ్ళీ అర గ్లాసు నీళ్లు పోసి పక్కన పెట్టండి.
  2. తరువాత కాస్త పెద్దగిన్నెలో 2గ్లాసులు పాలు పోసి పంచదార కూడా వేసి బాగా మరుగుతున్నప్పుడు యాలుకల పొడి వేయాలి
  3. ఇది మరుగుతుండగా ఇందులో నీళ్ళు కలిపి ఉంచిన చోడిపిండి ని వేసి పూర్తిగా కలుపుతూ ఉండాలి.మరుగు పట్టాక మరో 2 నిమిషాలు మంట తగ్గించి మరగ నివ్వాలి.
  4. బాగా మరిగాక కొంచెం దగ్గరపడుతుంది.మరీ పల్చగా కాకుండా మరీ ముద్దగా కూడా కాకుండా మద్యస్తాములో దోసల పిండిలా ఉన్నప్పుడే దించేసి సెర్వింగ్ బౌల్ లో తీసి దాంట్లో 1 చంచా డ్రై ఫ్రూట్ పొడి వేసి మీది నుండి మరో చంచా వేసి వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది.
  5. ఒక చిన్నా సూచిక, ఇది నేను పాలు పంచదార వేసి స్వీట్ ల చేసాను లిక్విడ్ గా.ఎవరికరిన ఇలా నచకపోయిన ,షుగర్ ఉన్నా దీనికి బదులు నీళ్ళల్లో ఉడికించి తీసి చల్లారేక బాగా పుల్లటి మజ్జిగ ఉప్పు వేసి కలుపుకొని త్రాగ వచ్చు. యిది కూడా చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర