హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పిండి చెక్కలు

Photo of Sago flour chekkalu by Pasumarthi Poojitha at BetterButter
4
7
0.0(0)
0

సగ్గుబియ్యం పిండి చెక్కలు

Jan-09-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పిండి చెక్కలు రెసిపీ గురించి

టేస్టీ అండ్ మమ్మి రెసిపీ ....ఇందులో సగ్గుబియ్యం పొడి చేసి ,బియ్యం పిండి ,మైదా వాడను కూరగాయలు పిల్లలకు కూడా చాలా మంచిది ఉదయం టిఫిన్ కి బాగుంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సగ్గుబియ్యం 1 సగం కప్
  2. బియ్యం పిండి సగం కప్
  3. మైదా 3 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు సరిపడా
  5. క్యారెట్ 1
  6. బీన్స్ 4
  7. జీరా 1 టేబుల్ స్పూన్
  8. పచ్చి మిర్చి 1
  9. నూనె ఫ్రై కి సరిపడా
  10. నీళ్లు కలపడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో సగ్గుబియ్యం వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి.
  2. ఇప్పుడు కూరగాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో సగ్గుబియ్యం పిండి ,మైదా,బియ్యం పిండి,ఉప్పు ,తరిగి పెట్టుకుని ఉన్న కూరగాయలు,జీలకర్ర,పచ్చి మిర్చి అన్ని వేసుకోవాలి.
  4. అందులో నీళ్లు కొన్ని పోసుకొని ముద్ద ల కలుపుకోవాలి.
  5. ఇప్పుడు పోయి వెలిగించి ముకుడు పెట్టి నూనె వేసి బాగా వేడి అయ్యే వరకు ఉండాలి.
  6. ఈలోపు చెక్కలు ఇలా చేసుకొని పక్కన కాగుతున్న నూనె లో వేసుకొని 5 నిమిషాలు వరకు ఫ్రై చేయాలి.
  7. అన్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి.
  8. ఇప్పుడు ఒక ప్లేట్ లో కి తీసుకొని టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర