హోమ్ / వంటకాలు / గోధుమ పిండి కారం కాజాలు

Photo of Weatflour hot chips by Chandrika Marripudi at BetterButter
523
4
0.0(0)
0

గోధుమ పిండి కారం కాజాలు

Jan-09-2019
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి కారం కాజాలు రెసిపీ గురించి

గోధుమ పిండితో చేసే కాజాలు తేలికగా చేసుకునే పిండి వంటకం. చిరు తిండిగా టీతో పాటు తినడానికి బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. గోధుమ పిండి : 1 కేజీ
  2. ఉప్పు : 2స్పూన్లు
  3. కారం : 2స్పూన్లు
  4. వాము : 4 స్పూన్లు
  5. నూనె : వేయించడానికి సరిపడ
  6. నీళ్లు :పిండి కలపడానికి తగినన్ని

సూచనలు

  1. గోధుమ పిండి ఒక బేసిన్ లో వేసి దాన్లో ఉప్పు, కారం,వాము,2స్పూన్ల నూనె వేసి అంతా కలిసేలా కలపాలి.
  2. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
  3. ఒక అరగంట నాననివ్వాలి.
  4. తరువాత మళ్లీ ఒకసారి మర్దన చేసి సమానంగా ముద్దలాగా చేసి చపాతీ కర్రతో చపాతీ లా వత్తుకోవాలి
  5. తరువాత దాన్ని డైమండ్ ఆకారంలో చిన్న బిళ్ళలుగా కోసుకోవాలి
  6. బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి కాగనివ్వాలి
  7. నూనె కాగాక చేసి పెట్టుకున్న కాజాలు వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి
  8. చల్లారాక డబ్బాలో పోసుకుని పెట్టుకుంటే 15 రోజుల వరకు ఉంటాయి తినడానికి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర