హోమ్ / వంటకాలు / జంతికలు

Photo of jantikalu by Lakshmi Varun at BetterButter
702
5
0.0(0)
0

జంతికలు

Jan-10-2019
Lakshmi Varun
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికలు రెసిపీ గురించి

ఇవి సంక్రాంతి పండుగకి అందరు కచ్చితంగా చేస్తారు...ఒక్కొక్కలు ఒక్కో విధంగా చేస్తారు... నేను అయితే వేపిన శనగపప్పు,బియ్యం తో చేశాను...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం : 1/2 కేజీ
  2. వేపిన శెనగపప్పు/పుట్నాల పప్పు : 1/2 కేజీ
  3. వాము : 2 స్పూన్లు
  4. కారం : 1 స్పూను
  5. ఉప్పు : తగినంత
  6. నూనె : వేయించాడానికి సరిపడా
  7. నీళ్లు : తగినంత
  8. జంతికల గొట్టం

సూచనలు

  1. ముందుగా బియ్యం,వేపినశెనగపప్పు ని మర పట్టించుకోని పిండిని సిద్దంగా ఉంచాలి....
  2. తరువాత ఒక బేసిన్ తీసుకోని అందులో మర పట్టించుకున్న బియ్యంపిండి,శెనగపిండి వాము,ఉప్పు,కారం, 3స్పూన్ల వేడి చేసిన నూనె వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి...
  3. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోస్తు చపాతీ పిండి కన్నా కొంచెం పలుచగా కలుపుకుని పిండిని 5నిమిషాలు పక్కన పెట్టుకోవాలి...
  4. ఈలోపు స్టవ్ పై మూకుడు పెట్టి నూనె వేసి బాగా కాగనివ్వాలి..
  5. జంతికల గొట్టానికి కొంచెం నూనె రాసి సిద్దంగా ఉంచాలి...
  6. ఇప్పుడు పక్కన పెట్టిన జంతికల పిండిని తీసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెం గా పిండిని జంతికల గొట్టంలో పెట్టి కాగిన నూనెలో జంతికలు వేసుకోవాలి...
  7. వీటిని బంగారు రంగు వచ్చేవరకు వేయించి తియ్యాలి...అంతే జంతికలు రెడీ...
  8. వీటిని గాలి చొరని డబ్బాలో పెడితే 10,15రోజులు నిల్వ ఉంటాయి....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర