హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of Ariselu by kalyani shastrula at BetterButter
939
4
0.0(0)
0

అరిసెలు

Jan-11-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

తడిబియ్యంపండితో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 10

  1. Kg. పాత బియ్యం
  2. 700gr.పాకం బెల్లం
  3. చెంచా ఇలాయిచిపొడి
  4. నువ్వులు ఇష్టాన్ని బట్టి
  5. గోలించడానికి సరిపడా నూనె /నెయ్యి
  6. పూరీ ప్రెస్ లేదా అరిసెల చెక్క

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని రాత్రి అంత నానబెట్టి ఉదయాన్నే నీళ్లను వడకట్టి పదినిమిషాలు ఆరనివ్వాలి
  2. బియ్యాన్ని మర పట్టించాలి .లేదా మిక్సీలో వేసి జల్లించుకోవాలి
  3. ఇప్పుడు మెత్తటి తడి పిండి వస్తుంది
  4. మందపాటి గిన్నెలో బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి కరిగాక వడకట్టాలి .ఇలా చేస్తే ఏదైనా చెత్త ,రాళ్లు ఉంటే పోతాయి . ఇప్పుడు బెల్లంనీళ్లను స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి
  5. పాకం ను మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి
  6. ఇప్పుడు పాకం దగ్గరగా వస్తుంది
  7. పాకం అయిందో లేదో తెలుసుకోవాలంటే నీళ్ళ లో పాకం వేయగానే ఉండేలాగా గట్టిపడాలి.
  8. ఇప్పుడు పాకంలో ఇలాయిచిపొడి ,నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసి తడి బియ్యం పిండి పోస్తూ కలపాలి .ఒక ముద్దవలె అవుతుంది .
  9. ఇప్పుడు నిమ్మకాయంత ముద్ద తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద పలచగా ఒత్తుకుంటే అరిసెలు కరకర లాడుతూ ఉంటాయి .మందంగా ఒత్తుకుంటే మెత్తగా ఉంటాయి .కరకర వలె ఒత్తినాను .
  10. దీనిని కాగుతున్న నూనెలో వేసి మీడియం మంట మీద వేగనివ్వాలి.రెండోవైపు తిప్పగానే పొంగుతుంది .
  11. దేనిని తీసి గరిటతో ఒత్తి పక్కన అరిసెలు పీట తో కాని ,లేదా పూరీ ప్రెస్ లో కాని వేసి ఒత్తితే నూనె మొత్తం పోతుంది .
  12. గట్టిగా ఒత్తితే పలచగా ఉండి కరకరలాడుతూ ఉంటాయి . మాములుగా ఒత్తితే కొద్దిగా మందంగా మెత్తగా ఉంటాయి
  13. వీటిని అలాగే బయట చిల్లుల బుట్టలో వేసి రాత్రి అంత ఉంచితే ,ఇంకా ఏమైనా నూనె ఉంటే పోతుంది .ఇష్టమున్నవాళ్ళు గసగసాలు చల్లుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర