హోమ్ / వంటకాలు / మిల్లెట్ డిలైట్

Photo of Millet Delight by Abhinetri V at BetterButter
640
6
0.0(0)
0

మిల్లెట్ డిలైట్

Jan-13-2019
Abhinetri V
180 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిల్లెట్ డిలైట్ రెసిపీ గురించి

కొర్ర మరియు గోధుమ పిండి తొ తయారైన ఈ మిల్లెట్ డిలైట్ ఆరోగ్యం తో పాటు రుచికరంగా కూడా ఉంటాయి. ఇవి పిల్లలు మరియు పెద్దలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • బేకింగ్
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. ముద్ద/డో కోసం- కొర్ర పిండి - 1 కపు
 2. గోధుమ పిండి - 1.25 కప్పులు
 3. డ్రై ఈస్ట్ - 1/2 టేబుల్ స్పూన్
 4. ఉప్పు- చిటికెడు
 5. నువ్వుల నూనె - 3 టేబుల్ స్పూన్స్
 6. చెక్కర - 2 టేబుల్ స్పూన్స్
 7. నీరు /పాలు ( గోరువెచ్చని ) - 1/2 కప్పు
 8. స్టఫ్ కోసం - బీట్రూట్ తురుము - 1 కప్పు
 9. నెయ్య - 4 టేబుల్ స్పూన్స్
 10. చెక్కర్ - 1/2 కప్పు
 11. కిస్మిస్ ముక్కలు - 1 టీస్పూన్
 12. జీడిపప్పు ముక్కలు - 1 టీస్పూన్
 13. గుమ్మడి గింజలు - 1 టీస్పూన్
 14. బాదం ముక్కలు - 1 టీస్పూన్
 15. ఎండు ఖర్జురం ముక్కలు - 1 టీస్పూన్
 16. నువ్వులు - అద్దడానికి

సూచనలు

 1. ముందుగా ఒక గిన్నె తీసుకొని , అందులో గోరువెచ్చని నీరు పోసి, డ్రై ఈస్ట్ మరియు చెక్కరని కూడా కలిపి 15 నిమిషాలు వరకు పులియబెట్టాలి.
 2. ఇప్పుడు మరొక వెడల్పాటి గిన్నె లో గోధుమపిండి, కొర్రపిండి,ఉప్పు,నువ్వుల నూని, మరియు ఈస్ట్ మిశ్రమం కూడా వేసి అన్ని వైపులా నుండి బాగా కలిపి చపాతీ ముద్ద లాగా తయారు చేసుకోవాలి. అవసరమైతే తగినంత నీరు కూడా కలిపి ముద్ద తయారు చేసుకోవాలి.
 3. ఈ ముద్ద పై 1 పెద్ద చెంచా నువ్వుల నూనె రాసి, తడి బట్ట కప్పి 2 గంటల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముద్ద పొంగుతుంది.
 4. ఇంతలోపు, ఒక కడాయి లో నెయ్య వేసి కాగనివ్వాలి. నెయ్య కాగాక , డ్రై ఫ్రూట్స్ ని బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే తురిమిన బీట్రూట్ ని కూడా నెయ్యలో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించేకోవాలి.
 5. బీట్రూట్ మిశ్రంలో చెక్కర్ కూడా వేసి, సన్నని సెగ పై 5 నిమిషాలు పాటు వేగనివ్వాలి.
 6. ఇప్పుడు ముద్ద ని చిన్న సైజ్ ఉండలుగా చేసుకొని, పూరిలా వత్తి బీట్రూట్ మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసి బన్నులు గా తయారు చేసుకోవాలి.
 7. ఈ బన్నులని మరోసారి, తడి బట్ట కప్పి 30 నిమిషాల పాటు పొంగనివ్వాలి.
 8. అరగంట తరువాత, వీటిపై నెయ్య లేదా పాలు తో అద్ది, నువ్వులు జల్లి , ఒవేన్ లో 30 నిమిషాల పాటు 160 డిగ్రీ C వద్ద బేక్ చేసుకోవాలి.
 9. అలాగే రెండో వైపు కూడా తిరగేసి, మరో 25-30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల అన్ని వైవులా బేక్ అవుతుంది.
 10. ఈ బన్నులని ఒక గంట పాటు చల్లారనివ్వాలి.
 11. అంతే ఎంతో రుచికరంగా ఉండే మిల్లెట్ డిలైట్ సర్వ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర