హోమ్ / వంటకాలు / బొబ్బట్లు

Photo of Bobbattu by Sree Sadhu at BetterButter
515
2
0.0(0)
0

బొబ్బట్లు

Jan-17-2019
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బట్లు రెసిపీ గురించి

ఇది కాల్చిన తరువాత నెయ్యి వేసుకుని తింటే అద్భుతం గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ గోధుమ పిండి
  2. 1 కప్ మైదా పిండి
  3. 4-5 చెంచాలు నూనె
  4. 1/2 చెంచా ఉప్పు
  5. 1/4 చెంచా పసుపు
  6. నీళ్లు తగినంత
  7. నెయ్యి కాల్చడానికి సరిపడా
  8. 1 కప్ సెనగపప్పు
  9. 2.5 కప్పుల నీళ్లు
  10. 1 కప్ బెల్లం
  11. 1/2 చెంచా ఇలాచీ పొడి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా, గోధుమ పిండి ,ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు పోసి మెత్తటి పిండి కలుపుకోవాలి
  3. దాని మీద నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఒక కుక్కర్ లో నానిన సెనగపప్పు వేసి 6-7 విస్టల్స్ రానివ్వాలి
  5. ఇప్పుడు దానిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో బెల్లం, ఇలాచీ వేసి మిక్సీ చేసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నెయ్యి వేసి ఈ మిశ్రమం వేసి అంచులు వదిలే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. ఇప్పుడు తయారు చేసుకున్న పిండిని తీసుకుని వత్తాలి దానిమీద బెల్లం ,సెనగపప్పు మిశ్రమం పెట్టి మూసేసి మళ్ళి వత్తాలి
  8. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి నెయ్యి వేసి ఈ బొబ్బట్టు వేసి రెండు వైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర