BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జీడిపప్పు మైదా శంఖాలు

Photo of Maida cashew croissant  by Chandrika Marripudi at BetterButter
0
2
0(0)
0

జీడిపప్పు మైదా శంఖాలు

Jan-18-2019
Chandrika Marripudi
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు మైదా శంఖాలు రెసిపీ గురించి

మైదాపిండితో చేసే బ్రెడ్ లాంటి వంటకం.ఓవెన్ లేదా ఇసుక మీద బేకింగ్ చేసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఫ్రెంచి
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. మైదాపిండి : 1కప్
  2. పాలు : 1/2 కప్
  3. ఈస్ట్ : 1 1/2 స్పూన్
  4. పంచదార :6 టేబుల్ స్పూన్లు
  5. ఉప్పు : 1/4 స్పూన్
  6. వెన్న : 100గ్రా
  7. జీడిపప్పు పొడి : 1/2 కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చటి పాలు తీసుకుని అందులో ఈస్ట్, పంచదార వేసి కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టాలి.
  2. ఈస్ట్,పంచదార కరిగాక మైదా వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
  3. గంట తరువాత పిండి డబుల్ అవుతుంది
  4. ఇప్పుడు పిండిని మర్ధన చేసి పొడి పిండి వేసి పొడవుగా రోల్ చేసుకుని సమాన ముద్దలుగా కట్ చేసుకోవాలి
  5. వాటిని ఒకొకటి తీసుకుని పొడి పిండి వేసుకుని చపాతీలు లాగా వత్తుకోవాలి.
  6. ఇపుడు ఒక చపాతీ పైన వెన్న రాసుకుని ఆపైన జీడిపప్పు పొడి చల్లుకోవాలి
  7. ఆపైన మరొక చపాతీ పెట్టుకుని వెన్న రాసి కాజూపొడి చల్లి మరొక చపాతీ ఇలా అన్నీ పేర్చుకోవాలి
  8. అన్నీ పేర్చాక పొడిపిండి వేసుకుని మెల్లిగా వత్తుకోవాలి వెడల్పుగా సమంగా
  9. చాకుతో సమంగా త్రిభుజాల్లాగా కోసుకోవాలి
  10. ఒక్కొక్క త్రిభుజాన్ని పైన మధ్యలో చిన్న గాటు పెట్టి కోన్ లాగా చుట్టుకోవాలి.
  11. ఒక ప్లేటులో వెన్న రాసుకుని చేసుకున్న కోనులు పెట్టుకోవాలి
  12. ఒక వెడల్పు పాత్రలో ఇసుక పోసి పైన స్టాండ్ పెట్టి పైన కోనుల ప్లేటు పెట్టి మూత పెట్టి చిన్న మంట మీద 45 నుండి 60 నిమిషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర