హోమ్ / వంటకాలు / వెజ్ జొన్న ఆమ్లెట్

Photo of Veg jowar omlet  by Anitha Rani at BetterButter
833
5
0.0(0)
0

వెజ్ జొన్న ఆమ్లెట్

Jan-23-2019
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ జొన్న ఆమ్లెట్ రెసిపీ గురించి

జొన్న పిండి లో కూరగాయ ముక్కలు వేసి చేసేది...మెత్తగా ఆమ్లెట్ లాగా ఉంటుంది.పిల్లలు జొన్న పిండి యో చేసినవి తినాలంటే ఇష్టపడరు.ఇలా అయితే రుచిగా ఉంటుంది...అందరూ ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. జొన్నపిండి 200గ్రా
  2. బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్స్
  3. ఉల్లిపాయ ముక్కలు 1 కప్
  4. పచ్చిమిర్చి 4
  5. అల్లము చిన్న ముక్క
  6. కారట్ తురుము 1కప్
  7. ఉప్పు సరిపడా
  8. జీలకర్ర 1/2 స్పూన్
  9. కొత్తిమీర,కరివేపాకు
  10. నూనె సరిపడా

సూచనలు

  1. పిండి ని జల్లించి ,బియ్యపు పిండి ,ఉప్పు వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి దోస పిండి లాగా కలుపుకోవాలి.
  2. ఉల్లిపాయముక్కలు,కారెట్ తురుము,పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని సిద్ధము చీసుకోవాలి.
  3. స్టౌ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో 2 చెంచాలు నూనె వేసి ఉల్లిపాయముక్కలు,పైన ఉన్న వన్నీ వేసి వేపు కోవాలి.కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
  4. ముందుగా చేసుకున్న జొన్నపిండి మిశ్రమము లో కలపాలి.
  5. స్టవ్ మీద దోస పెనము పెట్టి వేడి అయ్యాక ఆమ్లెట్ లాగా పూసుకోవాలి.
  6. చివర లలో నూనె వేసుకొని త్రిప్పి మరల నూనె వేసి కాలనివ్వాలి.
  7. వేడి వేడి వెజ్ జొన్న ఆమ్లెట్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర