హోమ్ / వంటకాలు / నాన్ కటై బిస్కెట్స్ బాదం ,కాఫీ ఫ్లేవర్స్

Photo of Nan katai biscuits badam and coffie flavors by Pasumarthi Poojitha at BetterButter
384
3
0.0(0)
1

నాన్ కటై బిస్కెట్స్ బాదం ,కాఫీ ఫ్లేవర్స్

Jan-24-2019
Pasumarthi Poojitha
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నాన్ కటై బిస్కెట్స్ బాదం ,కాఫీ ఫ్లేవర్స్ రెసిపీ గురించి

కొత్తగా వెరైటీ గా ఉండాలి అని ఇలా ట్ర్య్ చేసాను నాన్ కటై బిస్కెట్స్ టేస్ట్ చాలా బాగున్నాయి టీ టైమ్ కి బెస్ట్ స్నాక్ ,పిల్లలకు కూడా బైట కంటే ఇలా ఇంట్లో చేస్తే హెల్త్ కి మంచిది....

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • బేకింగ్
  • మైక్రోవేవులో చెయ్యటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్పు
  2. బొంబాయి రవ్వ సగం కప్పు
  3. శనగ పిండి 4,5 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు చిటికెడు
  5. వెనిల ఎసెన్సు 1 టేబుల్ స్పూన్
  6. బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్
  7. నెయ్యి 1 కప్పు
  8. పంచదార 1 కప్పు
  9. గుడ్డు పసుపు సోనా 1
  10. బాదం 6,7 పప్పులు
  11. కాఫీ పొడి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా,శనగపిండి ,బొంబాయి రవ్వ, యాలుకల పొడి కొద్దిగా,బేకింగ్ పొడి,ఉప్పు చిటికెడు,వెనిల ఎసెన్సు, అన్ని వేసుకుని కలుపుకోవాలి.
  2. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో గుడ్డు సోనా వేసి బాగా జీలరించాలి. మరో గిన్నె లో పంచదార పొడి వేసుకొని కాచిన నెయ్యి పోసుకొని బాగా మెత్తగా స్మూత్ గా అయ్యే వరకు విస్క్ చేయాలి. చేసుకొని పక్కన ఉంచుకోవాలి, ఆ పొడి మిశ్రమాన్ని కూడా వేసుకొని ముద్ద ల కలుపుకోవాలి.
  3. ఇప్పుడు ఆ పిండి ముద్ద సగం సగం తీసుకొని ఒక దానిలో బాదం పప్పు ముక్కలు ,ఒక దానిలో కాఫీ పొడి వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్ లో 15 నిమిషాలు పెట్టుకోవాలి.
  4. పోయి వెలిగించి కలై పెట్టి అందులో ఉప్పు వేసుకొని లోపల స్టాండ్ పెట్టుకొని 15.నిమిషాలు వేడి చేయాలి మూత పెట్టి.
  5. ఈ లోపు బిస్కెట్ ముద్దలు తీసుకొని రౌండ్ షేప్ చేసి దాని పైన గుడ్డు సోనా మిశ్రమాన్ని రాసి బాదం పప్పు ఒక దాని పై,కాఫీ పొడి ఒక దాని పై వేసుకొని ఉంచాలి.
  6. కేక్ వండే దానిలో నెయ్యి రాసి పిండి జల్లుకొని బిస్కెట్ అందులో పెట్టుకొని వేడి చేసిన కలై లో పెట్టుకొని 40 నిమిషాలు ఉడికించాలి,సన్న మంట పై టూత్ పిక్ తో చూస్తే దానికి పిండి అంటకుండా ఉండాలి అప్పుడు ఉడికినట్టు...
  7. వేడి వేడి నాన్ కటై బిస్కెట్స్ రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర