హోమ్ / వంటకాలు / మెంతిఆకు బడీల కూర

Photo of Fenugreek chickpea flour stir fry  by Aparna Reddy at BetterButter
558
6
0.0(0)
0

మెంతిఆకు బడీల కూర

Jan-25-2019
Aparna Reddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతిఆకు బడీల కూర రెసిపీ గురించి

చాలా సులువుగా చేసుకోవచ్చు. చపాతీలు లేదా రైస్ లో తీసుకోవచ్చు.తెలంగాణ స్పెషల్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. 3 కప్పులమెంతి ఆకులు
  2. 1 కప్ శెనగ పిండి
  3. 1 చెంచా అల్లంవెల్లులి పేస్ట్
  4. 1 చెంచా గరంమసాలా పొడి
  5. 1/4 చెంచా పసుపు
  6. 1 చెంచా కారం పొడి
  7. ఉప్పు తగినంత
  8. 1/4 కప్ నీళ్లు
  9. 3 చెంచాల నూనె
  10. 1 చెంచా నువ్వులు
  11. 1/4చెంచా ఆవాలు
  12. 1/4 చెంచా జీలకర్ర
  13. 4 కరివేపాకు రెబ్బలు
  14. 2 ఎండు మిర్చి

సూచనలు

  1. ముందుగా మెంతి ఆకు ను బాగా కడుగుకొనిచిన్నగా తరిగి ఉంచుకోవాలి.
  2. ఒక బౌల్ తీసుకొని అందులో శెనగ పిండి,కారం, గరంమసాలా పౌడర్, పసుపు,ఉప్పు,అల్లంవెల్లులి పేస్ట్ వేసుకోవాలి.
  3. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొంటు పిండిని ముద్దగా కలుపుకోవాలి.పిండిలో ఒక స్పూన్ నూనె వేసుకొని బాగాకలుపుకొని ముద్దగా చేసుకోవాలి.
  4. పిండిని చిన్న చిన్న ఉండలు గా చేసుకొనికొద్దిగానూనె అరచేతికి రసుకొనిసిలెండర్ ఆకారంలో చేసుకోవాలి.
  5. పిండిని చిన్న చిన్న గోళి ల లాగా గుండ్రంగా చేసుకోవాలి.అన్ని ఒకే సైజ్ లో ఉండేలా చూసుకోవాలి.
  6. వీటిని బడీ లు అంటారు.వీటిని నూనె రాసిఉంచిన ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి.
  7. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొనిరెండు చెంచాల నూనె వేసుకొని ఆవాలు,జీలకర్ర. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించు కోవాలి
  8. ఇప్పుడు కడిగి ఉంచిన మెంతి కూర ను వేసుకొని 3 నుండి 4 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి.
  9. మెంతి కూర మగ్గిన తరువాతశెనగ పిండి తో చేసిఉంచిన బడీల ను వేసుకోని మూతపెట్టు కొని పచ్చివాసన పోయే వరకు 10 నిమిషాలు మగ్గనివ్వాలి.
  10. మెంతి ఆకు బడీల కూర ను ఒక బౌల్ లో కి తీసుకొని పైన కొద్దిగా నువ్వులు చల్లుకోవాలి.అంతే ఎంతో రుచి గా ఉండే మెంతి ఆకు తో బడీల కూర రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర