హోమ్ / వంటకాలు / అక్కి రొట్టి

Photo of Akki rotti by Anitha Rani at BetterButter
660
6
0.0(0)
0

అక్కి రొట్టి

Jan-25-2019
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అక్కి రొట్టి రెసిపీ గురించి

కర్ణాటక స్పెషల్.ఎక్కువగా టిఫిన్ కు చేస్తారు.శీతాకాలంలో ఎక్కువగా చేస్తారు..మనకు ఇష్టమైన కూరగాయలతో చెయ్యొచ్చు.వెన్న,పెరుగు,పొడులు, పచ్చడి తో తింటే రుచుగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపు పిండి 200గ్రా
  2. ఉల్లిపాయముక్కలు 1కప్ తరిగినవి
  3. పచ్చి మిర్చి ముక్కలు 6
  4. కొత్తిమీర 1/2కప్
  5. కరివేపాకు 4 రెబ్బలు
  6. నూనె సరిపడా
  7. ఉప్పు 1టేబుల్ స్పూన్

సూచనలు

  1. మొదట ఉల్లిపాయముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు,కొత్తిమీర చిన్నగా ,కరివేపాకు చిన్నగా కత్తిరించి పెట్టు కోవాలి.
  2. బియ్యపు పిండి జల్లించి పెట్టుకోవాలి.
  3. అందులో పైన తయారు చేసి పెట్టుకున్న ముక్కలు,ఉప్పు వేసి బాగా కలపాలి.
  4. వేడి నీరు పిండిలో పోస్తూ నెమ్మదిగా చేతితో కలుపుతూ ముద్దలాగా చేసు కోవాలి.
  5. రెండు చేతులతో బాగా మర్దన చేసుకోవాలి.కొద్దిగా నూనె చివరి లో వేసి పెట్టాలి.
  6. మనకు కావలసిన పరిమాణము లో ఉండలు చేసి పెట్టు కోవాలి.
  7. మిగతా పిండి ముద్ద మీద తడి నాప్కిన్ ను కప్పి పెట్టుకోవాలి.
  8. రేకు కానీ,తడి టవల్,బట్టర్ పాపేర్ కానీ తీసుకొని బియ్యపు పిండి ఉండ ని పెట్టి చేతి వేళ్ళ తో ఒత్తు కోవాలి.
  9. గుండ్రముగా చివరలో ఒత్తుకుంటు మధ్య లో బ్రోటన వెలు తో రంధ్రము పెట్టు కోవాలి.
  10. స్టవ్ మీద పెనము పెట్టి వేడి అయ్యాక నీరు చల్లుకుని రేకు మీద ఒత్తుకున్న రొట్టెను క్రింది విధముగా మూసి మెల్లగా రేకును తీయాలి.
  11. రొట్టె పైన నూనె రంధ్రము లో చుట్టూ వేసుకోవాలి.
  12. నెయ్యి,వెన్నను మనకు ఏదీ ఇష్టము అయితే ఆడివేసుకొని కాల్చు కోవచ్చు.
  13. రెండువైపులా అట్ల కాడ తో కాల్చుకోవాలి.నెమ్మదిగా చిన్న సెగ మీద కాల్చుకుంటే రొట్టె తయారు అవుతుంది.
  14. అక్కి రొట్టి తో వెన్న,పెరుగు,పొడిలో, ఎర్ర పచ్చడితో, కొబ్బరి పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర