నువ్వుల పట్టి(chikki) | Sesame seeds chikki Recipe in Telugu

ద్వారా Aparna Reddy  |  25th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Sesame seeds chikki by Aparna Reddy at BetterButter
నువ్వుల పట్టి(chikki)by Aparna Reddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

8

0

నువ్వుల పట్టి(chikki) వంటకం

నువ్వుల పట్టి(chikki) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sesame seeds chikki Recipe in Telugu )

  • 3 చెంచాల శెనగ పిండి
  • 3 కప్పుల నువ్వులు
  • 2 కప్పుల పంచదార
  • 1/2కప్ ఎండుకొబ్బరి పొడి
  • 4 చెంచాల నెయ్యి
  • నీళ్లు తగినంత
  • జీడిపప్పు
  • ఎండు ద్రాక్ష
  • రోజా పువ్వు రెక్కలు

నువ్వుల పట్టి(chikki) | How to make Sesame seeds chikki Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి అందులో నూనె లేకుండా నువ్వులు వేయించుకోవాలి.
  2. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె తీసుకొని పంచదార వేసుకొని స్టవ్ మీద పట్టుకోవాలి.పంచదార మునిగే వరకు నీళ్లు పోసుకొని తీగ పాకం వచ్చే వరకు ఆగాలి.
  3. ఇప్పుడు వేయించి ఉంచిన నువ్వులు వేసుకొని కొంచెం కొంచెం గా శెనగ పిండిని వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
  4. మద్య మద్య లో నెయ్యి వేసుకోవాలి.ఇది దగ్గర పడ్డాక నెయ్యి రాసిన పళ్ళెంలో వేసుకొని చపాతీ కర్రతో పలుచగా వత్తుకోవాలి.
  5. పై భాగం లో మనకు నచ్చిన విధముగా జీడిపప్పు, ఎండుద్రాక్ష, వేసుకోవాలి.
  6. చల్లారిన తరువాత బిల్లలుగా కట్ చేసుకోవలెను.
  7. అంతే శెనగ పిండి,నవ్వులతో చేసిన నువ్వుల చిక్కి రెడి.

Reviews for Sesame seeds chikki Recipe in Telugu (0)