హోమ్ / వంటకాలు / గోధుమపిండి బెల్లం కేక్

Photo of Wheatflour Jaggery Cake by Pravallika Srinivas at BetterButter
535
4
0.0(0)
0

గోధుమపిండి బెల్లం కేక్

Jan-26-2019
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి బెల్లం కేక్ రెసిపీ గురించి

సాధారణంగా మైదా పిండి,పంచదార తో చేసుకుంటారు కేక్ ని.కొంచం ఆరోగ్యంగా ఫైబర్ ఉండే గోధుమపిండి,ఐరన్ పోషకాలు ఉండే బెల్లం తో చేసిన ఆరోగ్యమైన కేక్ ఇది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి _ 2 కప్పులు
  2. బెల్లము _ 1 కప్పు తురిమినది
  3. నూనె _1/2 కప్పు
  4. పాలు _ కాచి చల్లారినవి 1/2 కప్పు
  5. బేకింగ్ పౌడర్ _ 1 స్పూను
  6. బేకింగ్ సోడా _ 1/4 స్ఫూను
  7. డ్రై ఫ్రూయిట్స్- ఖర్జురా బాదాం వేసాను
  8. యాలుకల పొడి _1/4 స్పూన్
  9. నెయ్యి - గిన్నీకి రాయడానికి

సూచనలు

  1. ముందుగా పొడి పదార్దాలు గోధుమ పిండి , బేకింగ్ పౌడర్ , బేకింగ్ సోడా అన్ని కలిపి జల్లించాలి.
  2. వేరొక పాత్ర లో తురిమిన బెల్లము వేసి గోరువెచ్చని పాలు 3 స్పూన్లు వేసి కరిగే వరకు కలుపుకోవాలి .
  3. కరిగిన బెల్లం లో నూనె, మిగిలిన పాలు వేసి బాగా కలుపుకోవాలి .
  4. ఈ కలిపిన తడి మిశ్రమం లో పొడి మిశ్రమం వేసి (cut & fold method) లో కలుపు కోవాలి.
  5. పైన డ్రైఫ్రూయిట్స్, యాలుకల పొడి వేసి మరొకసారి కలుపుకోవాలి.
  6. పిండి గట్టిగా ఉంటే కొన్ని పాలు వేస్కొవచ్చు .
  7. కలిపిన మిశ్రమాన్ని కేక్ పాత్ర లో (నెయ్యి రాసినది ) దాంట్లో కేక్ మిశ్రమాన్ని వేయాలి .
  8. నేను కుక్కర్ లో చేశాను .దాంట్లో ఇసుక లేదా ఉప్పు వేసి 10 నిమిషాలు కాలనివ్వాలి .
  9. కాలిన ఉప్పు /ఇసుక లో స్టాండ్ పెట్టి దాని మీద కేక్ పాత్ర పెట్టాలి .
  10. కుక్కర్ గాస్కెట్ మరియు విస్టల్ తీసేసి మూత పెట్టి సన్నని మంట మీద 30 to 40 min బేక్ చెయ్యాలి .
  11. మధ్యలో టూత్పిక్ కానీ స్పూన్ వెనక కాడతో ఛెక్ చేయండి .పిండి అంటకుండా ఉంటే కేక్ రెడీ.
  12. మొత్తం దశలు ఉన్న ఫోటో చూడండి.
  13. అంతే ఎంతో రుచికరమైన గోధుమపిండి బెల్లం కేక్ సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర