హోమ్ / వంటకాలు / కస్టర్డ్ నట్స్ క్రీమ్ నింపిన డోనట్స్.

Photo of Donuts filled with custard nuts cream by Chandrika Marripudi at BetterButter
542
3
0.0(0)
0

కస్టర్డ్ నట్స్ క్రీమ్ నింపిన డోనట్స్.

Jan-26-2019
Chandrika Marripudi
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కస్టర్డ్ నట్స్ క్రీమ్ నింపిన డోనట్స్. రెసిపీ గురించి

డోనట్స్ మైదా తో చేసే పూరీ లాంటి డీప్ ఫ్రై వంటకం. చేసే పద్దతి, రుచి కూడా భిన్నంగా ఉంటుంది. రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టపడతారు.నేను మైదా బదులుగా గోధుమపిండితో చేశాను.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • జాపనీస్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. గోధుమపిండి : 2కప్పులు
  2. పంచదార : 100గ్రా
  3. వెన్న : 50 గ్రా
  4. ఉప్పు : 1/2 స్పూన్
  5. పాలు :200ml
  6. గుడ్లు : 2
  7. ఈస్ట్ : 2 స్పూన్లు
  8. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ
  9. కస్టర్డ్ క్రీమ్ కోసం
  10. కస్టర్డ్ పౌడర్ : 5 టేబుల్ స్పూన్లు
  11. పాలు: 1/4 లీ
  12. పంచదార : 5 టేబుల్ స్పూన్లు
  13. జీడిపప్పు : 1/4 కప్పు
  14. బాదం : 1/4 కప్పు
  15. పిస్తా : 1/4కప్పు

సూచనలు

  1. ఒకగిన్నెలో వేడి పాలు తీసుకుని అందులో పంచదార, ఈస్ట్ వేసి కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి.
  2. ఈస్ట్, పంచదార బాగా కరిగాక గోధుమపిండి, ఉప్పు, గుడ్లు వేసి ముద్దగా కలుపుకోవాలి.
  3. ఒక గంటసేపు పక్కన పెట్టాలి.
  4. జీడిపప్పు, బాదం,పిస్తా లను చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  5. ఒక గిన్నెలో కస్టర్డ్ పొడి వేసి పాలు పోసి జారుడుగా కలుపుకోవాలి.
  6. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాలు పోసి మరగనివ్వాలి.
  7. ముక్కలు చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసి కలిపి ఒక నిమిషం అయ్యాక వేరే గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి
  8. ఇప్పుడు గోధుమపిండి ముద్దని ఒకసారి మర్ధన చేసి పొడి పిండి వేసి మందంగా చపాతీ లా వత్తుకోవాలి.
  9. ఒక వెడల్పు రౌండ్ గ్లాసు తో రౌండ్ గా డోనట్స్ కట్ చేసుకోవాలి.
  10. పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కట్ చేసిన డోనట్స్ ని.
  11. స్టవ్ పైన బాండీలో డీప్ ఫ్రైకి నూనె పోసి కాగనివ్వాలి.
  12. నూనె కాగాక డోనట్స్ ను వేసి వేయించుకుని తీసుకోవాలి.
  13. వేయించిన వాటిని పంచదార పొడి లో దొర్లించి పెట్టుకుని డోనట్స్ చివర చాకుతో కన్నం పెట్టి కస్టర్డ్ నట్స్ మిశ్రమాన్ని చిన్నగా లోపలకి నింపి ప్లేటులోకి తీసుకోవాలి.
  14. అంతే .ఎంతో రుచికరమైన డోనట్స్ తినడానికి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర