హోమ్ / వంటకాలు / మిరపకాయ బజ్జీలు( గుంటూరు స్టైల్)

Photo of greenchilli Fritters(In Guntur Style) by Pravallika Srinivas at BetterButter
524
7
0.0(0)
0

మిరపకాయ బజ్జీలు( గుంటూరు స్టైల్)

Jan-26-2019
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరపకాయ బజ్జీలు( గుంటూరు స్టైల్) రెసిపీ గురించి

మాములుగా మిరపకాయలులో చింతపండు వాము పెట్టి బజ్జిలు వేస్తారు.కానీ గుంటూరు జిల్లాలో పుట్నాలు,ఉప్పు,వాము కలిపి పొడి కొట్టి ఈ పొడిని మిర్చిలో పెట్టి బజ్జిలు వేసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • మిళితం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. శనగపిండి - 200 గ్రాములు
  2. బియ్యంపిండి - 50 గ్రాములు
  3. పుట్నాలు - 1 కప్పు
  4. వాము - 2 స్పూన్లు
  5. మిరపకాయలు - 15
  6. ఉప్పు - 1 స్పూను
  7. సోడా ఉప్పు - చిటికెడు
  8. నీరు - పిండి కలుపుకోవడానికి సరిపడా
  9. నూనె - డీప్ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సీ జార్లో పుట్నాలు,వాము,అరస్పూను ఉప్పు వేసి పొడికొట్టుకోవాలి.
  2. ఇప్పుడు బజ్జి మిరపకాయలు కడిగి మధ్యకు గాటు పెట్టి తయారు చేసిన వాము పిండిని పెట్టి పక్కన పెట్టాలి.
  3. ఇలాగే అన్ని మిర్చిలను స్టఫ్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఒక బెసనులో శనగపిండి,బియ్యంపిండి, మిగిలిన ఉప్పు,సోడా ఉప్పు వేసి కలుపుకోవాలి.
  5. పైనుండి నీరు వేసి బజ్జీలు పిండి లాగా కలుపుకోవాలి.
  6. ఒక కడాయి లో డీప్ఫ్రైకి నూనె పెట్టి మీడియం హీట్ లో ఉన్నప్పుడు స్టూఫ్చేసిన మిర్చిలను బజ్జిపిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.
  7. ఇలా పట్టినన్ని బజ్జిలు వేసి లైట్ గా వేయించుకోవాలి.తర్వాత పక్కన పెట్టుకోవాలి.
  8. ఇలాగే మరొక వాయి వేసి చిన్న మంట పైన లైట్ గా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  9. నూనె మరికొంచెం కాగనిచ్చి రెండు వాయలను కలిపి దోరగా వేయించుకోవాలి.
  10. ఇలా చేయడం వలన బాగా వేగుతాయి లేదంటే లోపల పిండిగా బయట మాడిపోతాయి.
  11. ఇలా మొత్తం వేసుకుంటే గుంటూరు స్టైల్ మిర్చి బజ్జీలు రెడీ.
  12. ఇందులోకి టమోటా నిల్వ పచ్చడిలో కొంచం బెల్లం నీరు కలిపి పెట్టుకోవాలి.
  13. బజ్జిలు కట్ చేసి ఉల్లి తరుగు మధ్యలో పెట్టి పైనుండి ఈ టమాటా చట్నీ వేస్తే తినడానికి రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర