హోమ్ / వంటకాలు / మిరపకాయ బజ్జిలు

Photo of Green chilli bajji by Swapna Tirumamidi at BetterButter
858
3
0.0(0)
0

మిరపకాయ బజ్జిలు

Jan-26-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరపకాయ బజ్జిలు రెసిపీ గురించి

మిరపకాయ బజ్జి అంటే తెలియని వాళ్ళు,తినని వాళ్ళు ఉండనే వుండరుకదా.చాలా సులభం,"అమితమైన రుచి తో తలచుకోగానే నోట్లో నీళ్లు ఊరించే మహిమ ఈ మిరపకాయ బజ్జిలకి మాత్రమే చెల్లు" అంటే అతిశయోక్తి కాదేమో.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. శెనగపిండి 2 కప్పులు
  2. వరి పిండి 2 చెంచాలు
  3. వాము 1 చెంచా
  4. బజ్జి మిరపకాయలు 10
  5. వంట సోడా పావు చెంచా.
  6. కారం అర చెంచా
  7. ఇంగువ 2 చిటికెళు
  8. స్టఫ్ కోసం....ఉడికించిన బంగాళదుంప పెద్దది ఒకటి.
  9. వేయించిన పల్లిలు ఒక కప్పు(4 చెంచాల పల్లిలు విడిగా ఉంచాలి)
  10. గరం మసాలా పొడి అర చెంచా
  11. చాట్ మసాలా పొడి పావు చెంచా
  12. ఆంచూర్ అర చెంచా.
  13. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కలు ఒక కప్పు
  14. కొత్తిమీర తరుగు 4 చెంచాలు.
  15. ఉప్పు చాలినంత
  16. నిమ్మకాయ ఒకటి పెద్దది.
  17. తాగే సోడా టిన్ లు 2.
  18. వేయించుకోడానికి చాలినంత నూని

సూచనలు

  1. ముందు మిరకాయలు కడిగి ఒక పక్క చీరి గింజలు తీసి పెట్టుకోవాలి.
  2. మిక్సీ జార్ లో అరకప్పు వేయించిన పల్లిలు,వాము,ఉప్పు కొద్దిగా,చాట్ మసాల ,గరం మసాలా ,ఆంచూర్ లు వేసి 2 సార్లు తిప్పి బరకగా అయ్యాక పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఉడికించిన ఆలూ ముద్దలా చేసి అందులో మిక్సీ చేసిన మిశ్రమాన్ని వేసి,2 చెంచాల ఉల్లిపాయముక్కలు,2 చెంచాల కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
  4. ఈ అన్నీ కలిపిన బంగాళదుంప మిశ్రమాన్ని చీల్చిన మిరపకాయల్లో సరిపడినంత కూరి పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు బజ్జిలు వేయించడానికి ఒక మూకుడు పోయిమీదపెట్టి చాలినంత నూని వేసి వేడి చేసుకోవాలి...
  6. ఆ నూని కాగేలోపు... గిన్నీలో శెనగపిండి,వరి పిండి,కారం,ఉప్పు,చిటికెడు పసుపు అన్నీ కలిపి తగినంత నీళ్లుపోసి...వుండలులేకుండా.. కాస్త దోసెల పిండి మాదిరిగా కలిపి పెట్టుకోవాలి.
  7. ఇప్పుడు బజ్జి పిండిలో వంట సోడా కూడా కలిపి కూరిన మిరపకాయలని ఒక్కొక్కటిగా బజ్జి పిండిలో ముంచి ,ముచ్చిక పట్టుకుని జాగర్తగా నూనె లో జారవిడిచి మంట మధ్యస్తం గా ఉంచి ఎర్ర బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీసుకుని పక్కన పెట్టుకోవాలి...ఒక్కసారి 3 బజ్జిలు వేయించుకోవచ్చు...
  8. గ్లాసులో నిమ్మరసం పిండి ,కొద్దిగా ఉప్పు వేసి,సోడా పోస్తే నిమ్మ సోడా సిద్ధం.
  9. ఇప్పుడు వేయించిన బజ్జిని మళ్ళీ ఒకవైపు గాటు పెట్టి అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర,వేయించిన పల్లిలు,కలిపి వేసి కాస్త చాట్ మసాలా చల్లి,నిమ్మరసం పిండి ,పక్కన నిమ్మ సోడా తో సర్వ్ చేస్తే... సామిరంగా ఇక మీ బజ్జి రుచిని మిమ్మలిని ఎవ్వరూ మర్చిపోవలన్నా మర్చిపోరు .:yum::yum::yum::yum:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర