Photo of kathi Rolls by Shobha.. Vrudhulla at BetterButter
853
6
0.0(1)
0

kathi Rolls

Jan-26-2019
Shobha.. Vrudhulla
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఇటాలియన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 3 కప్పులు
  2. గోధుమపిండి 1 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. గోరువెచ్చని నీళ్లు 1 గ్లాసుడు
  5. స్టఫ్యింగ్ కోసము :
  6. ఉల్లి చెక్కు 1 కప్పు
  7. క్యారెట్ తరిగినది 1 కప్పు
  8. పువ్వు తరిగినది 1 కప్పు
  9. బుట్ట తరిగినది 1 కప్పు
  10. మటర్ 3/4 కప్పు
  11. స్వీట్ కార్న్ 3/4 కప్పు
  12. బీన్స్ తరిగినవి అర కప్పు
  13. శిమ్లా మిర్చి 1 కప్పు
  14. పనీర్ 100 గ్రా
  15. మిర్చి పొడి తగినంత లేక 2 చంచాలు
  16. ఉప్పు తగినంత
  17. పసుపు చిటికెడు
  18. ధనియా పొడి 2 చంచాలు
  19. జీరా పొడి 1 చంచా
  20. గరం మసాలా అర చెంచా
  21. కొత్తిమీర అర కప్పు
  22. నూనె అర కప్పు

సూచనలు

  1. ముందుగా మైదా మరియు గోధుమ పిండిలని జల్లించి ఉప్పు , కాస్త నునే వేసి కలిపి అప్పుడు గోరువెచ్చని నీళ్లు పోస్తూ రొట్టెల పిండిలా కలిపి పక్కన పెట్టుకోవలెను
  2. ఇప్పుడు స్టఫ్యింగ్ కోసము : ముందుగా స్టవ్ మీద ముకుడు పెట్టి వేడయ్యాక నూనె వేసి కాగాక అందులో ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి కానీ రోల్స్ కోసం కాబట్టి ఎక్కువగా కాకుండా పచ్చిగా ఉంటే బాగుంటయి.
  3. ఇవి వేగాక అందులో మిగిలిన కూరలు వేసి వేగాక టమాటాలు పనీర్ కూడా వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి
  4. ఇప్పుడు అందులో వరుసగా ఉప్పు,పసుపు,కారము,ధనియా పొడి ,జీరా పొడి,గరం మసాలా వేసి బాగా కలర్ వచ్చాక దించి అందులో కొత్తిమీర వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి.
  5. ఇప్పుడు కలిపిన పిండిని తీసుకొని మరోసారి బాగా కలిపి రొట్టెల చేసుకొని పెనం మీద లైట్ గా కాల్చాలి.
  6. అయిన తరువాత 2 వ వయిపు కూడా అలానే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేక తీసేయాలి.అలానే మొత్తం అన్ని రొట్టెలు చేసి పెట్టుకోవలెను.వీటికి నూనె కానీ నెయ్య కానీ వాడారు.
  7. ఇప్పుడు ఒక్కక్క రోటీ తీసి దానిలో చేసిన కూర బాగా వేసి జాగ్రత్తగా రోల్ చేసి పెట్టుకోవలెను.మధ్యలో కట్ చేసి పెట్టుకోవచ్చు బాగా కనిపిస్తుంది.
  8. ఇలా చేసుకున్నాక అది ఫాయిల్ పేపర్ తో కవర్ చేసి చుట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.అంతే ఎంతో రుచికరమయిన కాఠి రోల్స్ రెడీ .. వీటిని మయోనాయిజ్ సాస్ తో తింటే యుమ్మీ.అద్భుతము గా ఉంటుంది.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Suresh Chowdhary Abburi
Jul-15-2019
Suresh Chowdhary Abburi   Jul-15-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర