మటర్ పరోట | Matar paratha Recipe in Telugu

ద్వారా Aparna Reddy  |  26th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Matar paratha by Aparna Reddy at BetterButter
మటర్ పరోటby Aparna Reddy
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

మటర్ పరోట

మటర్ పరోట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Matar paratha Recipe in Telugu )

 • 2 కప్స్ గోధుమ పిండి
 • 2 కప్స్ గ్రీన్ పీస్ ( పచ్చి బఠాణీలు)
 • 4 పచ్చి మిర్చి
 • 1/4కప్ కొత్తిమీర తరుగు
 • 1/4చెంచా గరం మసాలా
 • 1/4చెంచా జీలకర్ర
 • ఉప్పు తగినంత
 • నూనె

మటర్ పరోట | How to make Matar paratha Recipe in Telugu

 1. ముందుగా గొదుమపిండిని బౌల్ లో తీసుకొని కొంచెం ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా కలుపుకొని పిండి ముద్దను పక్కన పెట్టుకోవాలి.
 2. పచ్చి బఠాణీలు కొద్దిగా నీరు పోసుకొనిఉప్పు వేసి ఉడికించుకోవాలి.
 3. ఉడికిన బఠాణీలలో నీళ్లను వంచుకొని కొంచెం చెక్కర వేసి పక్కన పెట్టుకోవాలి.చెక్కర వేయడము వలన గ్రీన్ కలర్ అలానే ఉంటుంది.
 4. బ్లెండర్ లో ఉడికించిన బఠాణీలు,పచ్చిమిర్చి,కొత్తిమీర వేసుకొని కొంచెం పలుకుగా బ్లెండ్ చేసుకోవాలి.
 5. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర వేసి దోరగా వేగిన తరువాత పైన బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకొని కొంచెం గరంమసాలా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.చల్లగా అయిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి
 6. చపాతీ పిండిని తీసుకొని పూరీలా వత్తుకొని మధ్యలో పైన చెసిఉంచిన ఉండ పెట్టుకొని నాలుగు వైపులా మూసి చపాతీ ల వత్తుకోవాలి.
 7. స్టవ్ వెలిగించి పాన్ పైన నూనె వేసి స్టఫ్ చేసిన మటర్ పరతా ను రెండువైపులా బాగా కాల్చు కోవాలి.
 8. అంతే ఎంతో రుచిగా ఉండే మటర్ పరటా రెడి.

Reviews for Matar paratha Recipe in Telugu (0)