హోమ్ / వంటకాలు / బెల్లం పూస మిఠాయి

Photo of Crispy muruku laddu with jagry by Swapna Tirumamidi at BetterButter
914
4
0.0(0)
0

బెల్లం పూస మిఠాయి

Jan-26-2019
Swapna Tirumamidi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం పూస మిఠాయి రెసిపీ గురించి

ఇదివరకు ఇళ్లలో చేసుకునేవారు .చాలా ప్రసిద్ధ మైన వంటకం.చాలా రుచిగా ఉంటుంది.బెల్లం కాబట్టి ఆరోగ్యం కూడా.ఇది గోదావరి జిల్లాల్లో చాలా పేరుగాంచిన వంటకం.బామ్మగారి దగ్గర నేర్చుకున్నాను.

రెసిపీ ట్యాగ్

  • కఠినము
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బెల్లం 250 గ్రా
  2. పంచదార ఒక కప్పు
  3. యాలకులు 6
  4. శెనగపిండి అర కేజీ
  5. బటర్ 15 గ్రా
  6. ఉప్పు పావు చెంచా
  7. వాము పావు చెంచా
  8. జాజికాయ చిన్నముక్క
  9. జాపత్రి చిన్నముక్క
  10. నూని వేయించడానికి కేజీ
  11. నెయ్యి 3 చెంచాలు

సూచనలు

  1. పిండి ని ఒక గంట సేపు ఎండలో పెట్టి తీసుకుని జల్లించి పెట్టుకోవాలి.
  2. జాజికాయ ,జాపత్రి,యాలకులు బాగా దంచి పొడి చేసుకోవాలి..అందులోనే చివరలో వాము కూడా వేసి ఒకసారి దంచి తీసుకుని సువాసన పోకుండా మూత పెట్టి పక్కన ఉంచాలి.
  3. మూకుడు లో నూనిపోసి వేడి చేసుకోవాలి.
  4. అది కాగేలోపు ...శెనగపిండి లో కరిగించిన బట్టర్,ఉప్పు వేసి పిండికి బాగా పట్టించి...అప్పుడు గోరు వెచ్చని నీరు పోస్తూ జంతికల ముద్దలా కలుపుకోవాలి.
  5. నూనె బాగా వేడిగా ఉండాలి...జంతికల గొట్టం లో పెద్దచిల్లుల బిళ్ళని పెట్టి పిండిని పెట్టి...వేడినూనెలో జంతికలు తిప్పుతూ వేయించుకోవాలి.
  6. ఒక పక్క వేగాక రెండో పక్కకూడా తిప్పి ఎర్రగా వేయించి తీసుకోవాలి.ఇలా పిండి అంతా జంతికలు చేసి తీసుకోవాలి.
  7. ఇప్పుడు పాకం కోసం...పొయ్యిమీద గిన్నిపెట్టి బెల్లం ,పంచదారను కలిపి వేసి ,350 ml నీళ్లు పోసి .కరిగించి వడకొట్టుకోవాలి(బెల్లం లో ఉన్న తుక్కు ఏమైనా ఉంటే పోడంకోసం వడకొట్టాలి)
  8. బెల్లం పాకం తయారయ్యేలోపు చేసుకున్న జంతికలన్నీ ముక్కలుగా చేసుకోవాలి అర అంగుళం మోతాదులో చిదుపుకోవాలి.పొడుం అయిపోకూడదు.
  9. పెద్ద వెడల్పాటి మూకుడు లో పాకాన్ని వడకొట్టి పొయ్యిమీద పెట్టి పాకం పట్టాలి...2 తీగల పాకం సుమారు గా ఉండ పాకం వచ్చాక నెయ్యి ,దంచిన మసాలా పొడి ని వేసి కలిపి కొద్దిసేపు ఉంచితే పాకం సరిపోతుంది.
  10. ఒక పళ్లెం కి నూని లేదా నెయ్యి రాసి ఉంచుకోవాలి.
  11. ఇప్పుడు చిదిపిన జంతిక పూస ని పాకంలో వేసి పాకం ,జంతిక పూస బాగా కలిసేట్టు బాగా తిప్పాలి,గబగబా చేయాలి ఈ పనిని.ఇప్పుడు నెయ్యిరాసిన పళ్లెం లోకి తీసుకుని చేతికి కూడా నెయ్యి రాసుకుని త్వర త్వరగా ఉండలు కట్టుకోవాలి.
  12. అంతే అండి చక్కని సువాసనతో కూడిన కరకరలాడే బెల్లం పూస లడ్డులు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర