హోమ్ / వంటకాలు / మినప్పిండి జంతికలు

Photo of Mash Dal Muruku by Swapna Tirumamidi at BetterButter
743
4
0.0(0)
0

మినప్పిండి జంతికలు

Jan-26-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప్పిండి జంతికలు రెసిపీ గురించి

చాలా సులువు , రుచి,ఆరోగ్యం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మినప్పిండి ఒక కప్పు/ 250గ్రా
  2. వరి పిండి 4 కప్పులు/ 1కేజీ
  3. నూపప్పు 4 చెంచాలు
  4. వాము 2 చెంచాలు
  5. ఉప్పు సరిపడా
  6. నూని వేయించడానికి చాలినంత.

సూచనలు

  1. మినప్పిండి,వరిపిండి, వాము,నూపప్పు అన్ని ఒక బెసనులో వేసి నీళ్లు పోసి ముద్దలా కలిపి పెట్టుకోవాలి.
  2. మూకుడు లో నూనె పోసి వేడిచెయ్యాలి.
  3. నూని కాగే లోపు జంతికల గొట్టం తీసుకొని మూడు కన్నాలు ఉన్న బిళ్ళ పెట్టి పిండిని పెట్టి ఉంచుకోవాలి.
  4. నూనె బాగా కాగిన తరువాత అందులో జాగర్తగా జంతికలు వత్తుకోవాలి...
  5. డైరెక్టుగా నూనెలో జంతికలు తిప్పలేని వారు... ఇంట్లో టీ సాసర్ లు ఉంటే వాటిని తీసుకొని....వాటిని బోర్లించి కాస్త నూనె రాసి వాటిమీద జంతికలు తిప్పి పెట్టుకుని....నూని లో వేసుకోవచ్చు...ఇది చాలా సులువు ...ఇంకా పని కూడా తొందరగా అవుతుంది...ఒక వాయ వేగేలోపు ఇలా సాసర్ల మీద జంతికలు తిప్పి రెడీగా పెట్టుకుంటే ముందు వాయ అవ్వగానే ఇవి వేసి వేయించుకోవచ్చు.
  6. ఇలా వేసి రెండు పక్కలా వేయించి తీసుకోవాలి..బంగారు గోధుమ రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి.
  7. మినప్పిండి జంతికలు కాబట్టి బాగా ఎర్రగావుండవు...బంగారుగోధుమ రంగులోనే ఉంటాయి...శెనగపిండి వేస్తే ఎర్రగా ఉంటాయి.
  8. అంతే అండి సులభమైన కమ్మని కరకరలాడే మినప్పిండి జంతికలు సిద్ధం... చేసుకొని ఎలవున్నాయో చెప్పండి మరి.:yum::yum::yum::yum:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర