హోమ్ / వంటకాలు / సోయా , నువ్వుల బిస్కెట్స్

Photo of Soya , sesame cookies by lakshmi kumari at BetterButter
534
8
0.0(0)
0

సోయా , నువ్వుల బిస్కెట్స్

Jan-28-2019
lakshmi kumari
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా , నువ్వుల బిస్కెట్స్ రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఒరిస్సా
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. సోయా గ్రాన్యూల్స్ పొడి 1 కప్
  2. పాల పొడి 2 టేబుల్ స్పూన్స్
  3. బేకింగ్ పౌడర్ 1 టీస్పూన్
  4. బేకింగ్ సోడా 1/4 టీస్పూన్
  5. వెన్న లేదా నెయ్యి 4 టేబుల్ స్పూన్స్
  6. పంచదార పొడి 1 కప్
  7. తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్స్
  8. పాలు 4 టేబుల్ స్పూన్లు
  9. ఉప్పు 1/4 టీస్పూన్
  10. వెనిల్లా ఎసెన్స్ 1 టీస్పూన్

సూచనలు

  1. సోయా గ్రాన్యుల్స్ ని గ్రైండర్ లో వేసి , బాగా పొడి చేసుకోవాలి.
  2. సోయా పొడి, పాలపొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, కలిపి జల్లించుకొవాలి
  3. ఒక గిన్నెలో పంచదార పొడి, నెయ్యి వేసి, పంచదార పొడి కరిగి కలిసేదాకా బాగా కలుపుకోవాలి
  4. ఇందులో జల్లించి పెట్టుకున్న సోయా పొడిని వేసుకోవాలి
  5. చేతి ముని వ్రేళ్ళతో కలుపుకోవాలి,
  6. బ్రెడ్ పొడి లా కలుపుకోవాలి
  7. నువ్వులు వేసి కలపాలి
  8. పాలు పోస్తూ చపటి పిండి లా కలపాలి
  9. మూత పెట్టి 2 నిముషాలు పక్కన పెట్టాలి
  10. ఓటిజి అయినా, మైక్రోవేవ్ కన్వెక్షన్ ఓవెన్ అయినా 180* డిగ్రీస్ లో 10 నిముషాలు ప్రి హీట్ చెయ్యాలి
  11. కలిపిపెట్టుకున్న, పిండి ముద్దను చపాతీ లా వత్తుకుని, నువ్వులు పైన వేసి నెమ్మదిగా వత్తాలి
  12. సీసా మూత తో బిస్కెట్స్ మాదిరి కట్ చేసుకోవాలి
  13. బేకింగ్ ట్రే కి బట్టర్ రాయాలి
  14. ట్రే లో బిస్కెట్లు పెట్టీ 15 నిముషాలు బేక్ చేయాలి
  15. అంచులు లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఓవెన్ ఆఫ్ చెయ్యాలి
  16. 2 నిముషాలు అయ్యేక ట్రే బయటికి తీసి, చల్లారెక , డబ్బా లో వేసుకుని పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర