సాంబారు | SAMBAR Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  29th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of SAMBAR by Pasumarthi Poojitha at BetterButter
సాంబారుby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

39

0

సాంబారు వంటకం

సాంబారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SAMBAR Recipe in Telugu )

  • కందిపప్పు 1 కప్పు
  • క్యారెట్ 1
  • ఉల్లిపాయ 1 తరిగినవి
  • పచ్చి మిర్చి 2
  • టమాటో 1 తరిగినవి
  • కరివేపాకు 1 రెమ్మ
  • తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్స్
  • నూనె కొద్దిగా
  • ఎండు మిర్చి 2
  • చింతపండు కొద్దిగా
  • నీళ్లు సరిపడా
  • పసుపు కొద్దిగా
  • ఉప్పు సరిపడా
  • కారం 1 టేబుల్ స్పూన్
  • సాంబరు పొడి 1 టేబుల్ స్పూన్
  • బంగాళాదుంప 1 ముక్కలుగా తరిగినవి
  • ముళ్ళకాయ 2
  • వెల్లులి పాయ 1

సాంబారు | How to make SAMBAR Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి ,ములకాయ ముక్కలు నీళ్లు పోసుకొని పోయి వెలిగించి గిన్నె పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
  2. కంది పప్పు ములకాయ ముక్కలు ఉడికిన తర్వాత ములకాయను తీసేయాలి.
  3. పప్పు మిశ్రమం లో టమాటో ,ఉల్లిపాయ ,పచ్చి మిర్చి,బంగాళదుంప, అన్ని తరిగి పెట్టుకుని ఉన్న ముక్కలు,ములకాయ ముక్కలు,కరివేపాకు వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  4. నీళ్లు పోసుకొని చింత పండు ననపెట్టుకోవాలి అది నానిన తర్వాత గుజ్జు ను తీసి ముక్కలు ఉడికించి గిన్నె లో పోసుకోవాలి ,సాంబారు ఉడుకు తు ఉండగా కారం ,పసుపు,ఉప్పు సరిపడా వేసుకొని ఉడికించాలి,మరో గిన్నె లో తాలింపు కోసం నూనె వేసి అందులో తాలింపు గింజలు, వెల్లులి దంచి వేసుకోవాలి,ఎండు మిర్చి,కరివేపాకు, ఇంగువా వేసుకొని వేగిన తర్వాత సాంబరు లో వేసుకొని కలుపుకోవాలి.
  5. అంతే వేడి వేడి సాంబరు రెడీ...

Reviews for SAMBAR Recipe in Telugu (0)