హోమ్ / వంటకాలు / మూంగ్ పకోడా( పెసర పకోడా)

Photo of Moong Pakoda by Sadhhna praveen at BetterButter
644
6
0.0(0)
0

మూంగ్ పకోడా( పెసర పకోడా)

Jan-29-2019
Sadhhna praveen
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మూంగ్ పకోడా( పెసర పకోడా) రెసిపీ గురించి

లైట్ ప్రోటీన్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. పెసర పప్పు 200 గ్రాములు
  2. ఉప్పు తగినంత
  3. పచ్చి మిరపకాయలు 6-8
  4. పసుపు పావు టీ స్పూన్
  5. కరివేపాకు రెమ్మ ఒకటి
  6. కొత్తిమీర హాఫ్ కట్ట
  7. వాము హాఫ్ టీ స్పూన్
  8. జీలకరా పొడి హాఫ్ టీ స్పూన్
  9. దనియా పొడి హాఫ్ టీ స్పూన్
  10. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్
  11. మిరియాల పొడి పావు టీ స్పూన్
  12. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా పెసర పప్పు ని 2 గంటల పాటు నానపెట్టుకోవాలి
  2. ఇప్పుడు నీటిని వార్చేసి నానిన పప్పుని మిక్సీ జార్ లో వేసుకివాలి
  3. ఈ జార్ లో ఉప్పు,పచ్చి మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అల్లంవెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి
  4. ఇప్పుడు ఈ పేస్ట్ లో వాము, జీలకరా పొడి, దనియా పొడి,పసుపు,మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని వేడి ఎక్కనివ్వాలి
  6. అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి
  7. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి
  8. ఇప్పుడు రెడి గా ఉన్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా నూనె లో వేసుకోవాలి
  9. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చెదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి
  10. అంతే మూంగ్ పకోడా రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర