హోమ్ / వంటకాలు / కొర్రలతో కిచిడి

Photo of Foxtail millet kichidi by Chandrika Marripudi at BetterButter
630
6
0.0(0)
0

కొర్రలతో కిచిడి

Jan-30-2019
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్రలతో కిచిడి రెసిపీ గురించి

కొర్రలు ,పెసర,కందిపప్పు తో చేసిన కిచిడి.సిరి ధాన్యాల్లో కొర్రలు ఒకటి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కొర్రలు : 2కప్పులు
  2. పెసరపప్పు : 1/2 కప్పు
  3. కందిపప్పు : 1/2 కప్పు
  4. ఉల్లిపాయలు : 2
  5. టొమాటో : 1
  6. ఆలూ : 2
  7. పచ్చిమిర్చి : 8
  8. కాప్సికమ్ : 1
  9. క్యారెట్ : 1
  10. తరిగిన కొత్తిమీర : 1/2 కప్పు
  11. ఉప్పు : తగినంత
  12. ఆవాలు : 2 స్పూన్లు
  13. జీలకర్ర : 2 స్పూన్లు
  14. నూనె : 4స్పూన్లు

సూచనలు

  1. కొర్రలు, పెసరపప్పు, కందిపప్పు శుభ్రంగా కడిగి 4 గంటలు నాననివ్వాలి
  2. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక కూర ముక్కలన్నీ వేసి వేయించాలి.
  4. కూర ముక్కలు మగ్గాక నానపెట్టుకున్న కొర్రలు పప్పులను నీళ్ళు తీసేసి కుక్కర్ లో వేసి కలుపుకోవాలి.
  5. ఒక కప్పు కి రెండు కప్పులు నీళ్ళు చొప్పున పోసి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.
  6. మెత్తగా ఉడికాక తరిగిన కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాలు సిమ్ లో పెట్టి స్టవ్ ఆపేసి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర