హోమ్ / వంటకాలు / వెజ్ పీజ్జా (ఇండియన్ స్టైల్)

Photo of PIZZA(Indian style) by Rashmi SudhiMurthy at BetterButter
121
4
0.0(0)
0

వెజ్ పీజ్జా (ఇండియన్ స్టైల్)

Jan-30-2019
Rashmi SudhiMurthy
150 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పీజ్జా (ఇండియన్ స్టైల్) రెసిపీ గురించి

పిజ్జా అంటే అందరూ ఇష్టపడతారు. ఇంట్లో చేసుకుంటే బయట దొరికేవాటికంటే ఆరోగ్యకరం

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లలకు నచ్చే వంటలు
 • బేకింగ్
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

 1. మైదా 1& 1/2 కప్పులు
 2. గోధుమ పిండి 1/4 కప్
 3. క్వినోవా ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు
 4. డ్రై ఈస్ట్ 1 టీ స్పూన్
 5. పంచదార 1 టీ స్పూన్
 6. ఉప్పు 1&1/4 టీ స్పూన్( పిజ్జా బేస్ కోసం)
 7. నీళ్ళు 1 కప్
 8. ఆలివ్ నూనె 4 టేబుల్ స్పూన్లు
 9. టమాటో ముక్కలు 1 కప్ సన్నగా తరగాలి
 10. ఉల్లిపాయలు 3
 11. వెల్లుల్లి తరుగు 2 టేబుల్ స్పూన్లు
 12. కారం పుడి 1 టీ స్పూన్
 13. కిచెన్ కింగ్ మసాలా 1 టీ స్పూన్
 14. షెజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్
 15. మిక్స్డ్ హెర్బ్స్ 2 టేబుల్ స్పూన్లు
 16. క్యాప్సికమ్ 1
 17. పనీర్ 1/2 కప్
 18. స్వీట్ కార్న్ 1/2 కప్
 19. చీజ్ 1 కప్

సూచనలు

 1. ముందుగా 1 కప్ నీళ్ళు వెచ్చగా చేసుకొని అందులో పంచదార,ఈస్ట్ వేసి కలిపి 10 నిమిషాలు ఉంచాలి
 2. మైదా,గోధుమ,క్వినోవా పిండి,ఉప్పు కలిపి,ఈస్ట్ నీళ్ళు ,కొంచెం ఆలివ్ నూనె వేసి ముద్దలా కలపాలి.పైన కొంచెం నూనె వేసి మూత పెట్టి 2 గంటలు నాన బెట్టాలి
 3. ఈలోగా పిజ్జా సాస్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేయాలి
 4. అది వేగాక అందులో టమాటో ముక్కలు వేసి మగ్గ నివ్వా లి.ఇందులో కి కొంచెం షెజ్వన్ సాస్ కొంచెం నీళ్ళు వేసి కలపాలి
 5. ఇప్పుడు ఈ సాస్ లోకి మిక్స్డ్ హెర్బ్స్,కిచెన్ కింగ్ మసాలా,కారం పుడి వేసి వేగనివ్వాలి.ఇప్పుడు పిజ్జా సాస్ రెడీ
 6. మైక్రోవేవ్ 200 డిగ్రీ సెలసిస్ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి
 7. ఇప్పుడు పిండిని రెండు భాగాలుగా విడదీసి(2 పిజాలు చేసేందుకు వీలుగా) ఒక భాగం తీసుకుని పిజ్జా చేసే ప్లేట్ లో కొంచెం ఆలివ్ నూనె రాసి థిన్ క్రస్ట్ కావాలంటే పల్చగా లేదా మందంగా కావాలంటే మందంగా ఒత్తుకోవాలి.పిజ్జా బేస్ రెడీ
 8. ఇప్పుడు పిజ్జా బేస్ పైన తయారు చేసుకున్న సాస్ వేసి స్ప్రెడ్ చేయాలి
 9. ఇప్పుడు దీనిపైన క్యాప్సికమ్, ఉల్లిపాయముక్కలు, పనీర్,స్వీట్ కార్న్, చీజ్ తురుము వేసి 200 డిగ్రీ లో 20 నుంచి 25 నిమిషాలు బేక్ చేయాలి
 10. పిజ్జా కి పిజ్జా సీసానింగ్, చిల్లి ఫ్లేక్స్ వేసి వేడిగా సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర